హైదరాబాద్: ఓల్డ్ మలక్‌పేటలోని 26 డివిజన్ లో గురువారం నాడు (డిసెంబర్ 3వ తేదీన) రీ పోలింగ్ నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకొంది.

ఈ డివిజన్ నుండి  సీపీఐ అభ్యర్ధి పోటీ చేశారు. సీపీఐ అభ్యర్ధి ఎన్నికల గుర్తు కంకి కొడవలికి బదులుగా సీపీఎం ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి గుర్తును బ్యాలెట్ పత్రంలో ముద్రించారు. ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఘటన చోటు చేసుకొంది.

also read:గుర్తులు తారుమారు: ఓల్డ్ మలక్‌పేటలో పోలింగ్ రద్దు

ఈ విషయాన్ని గుర్తించిన సీపీఐ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చారు. సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పార్ధసారథికి ఫిర్యాదు చేశారు.

ఈ డివిజన్ లో  పోలింగ్ ను రద్దు చేయాలని సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. ఇవాళ జరిగిన పోలింగ్ ను రద్దు చేయాలని ఈసీ నిర్ణయం తీసుకొంది. ఇవాళ ఉపయోగించిన బ్యాలెట్ బాక్సులను  సీజ్ చేశారు. ఈ డివిజన్ పరిధిలోని 69 పోలింగ్ స్టేషన్లలో   ఈ నెల 3 వ తేదీన  రీ పోలింగ్ నిర్వహించనున్నారు.