Asianet News TeluguAsianet News Telugu

TSRTC: టీఎస్‌ఆర్టీసీకి అవార్డుల పంట..

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు అవార్డుల పంట పడింది. జాతీయ స్థాయిలో ఐదు అవార్డులు టీఎస్‌ఆర్టీసీకి దక్కాయి. ఇంతకీ ఆ అవార్డులేంటీ? 
 

TSRTC wins 4 first, a 2nd best national awards for 2022-23 KRJ
Author
First Published Mar 3, 2024, 1:54 AM IST

TSRTC: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్టీసీ)కు అవార్డుల పంట పడింది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ అండర్‌టేకింగ్స్ (ASRTU) నుంచి టీఎస్ఆర్టీసీకి ఐదు అవార్డులు దక్కాయి. 2022-23 సంవత్సరానికి TSRTC కి రహదారి భద్రత, సమర్థవంతమైన ఇంధన నిర్వహణ, ఉద్యోగుల భద్రత, సాంకేతిక సామర్థ్య విభాగాలలో అవార్డులు దక్కాయి.

ఈ ఐదింటిలో TSRTC రోడ్డు భద్రత విభాగంలో ప్రథమ బహుమతి, గ్రామీణ ప్రాంతాల్లో ఇంధన సామర్థ్య నిర్వహణ విభాగంలో ప్రథమ, అర్బన్‌ విభాగంలో ద్వితీయ, ఉద్యోగుల సంక్షేమం, మెరుగైన ప్రయాణ అనుభవం కోసం సాంకేతికతను ఉపయోగించడంలో మొదటి బహుమతి లభించింది . ఈ నెల 15న ఢిల్లీలో అవార్డులను అందజేయనున్నట్టు ఏఎస్‌ఆర్‌టీయూ ప్రకటించింది. 
 
కాగా, వివిధ విభాగాల్లో టీఎస్‌ఆర్టీసీ ఐదు అవార్డులు గెలుచుకోవడంపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్పోరేషన్ సిబ్బంది కృషి, అంకితభావానికి అద్దం పడుతూ ఈ విజయం సాధించిందని, టీఎస్‌ఆర్టీసీ సిబ్బందికి, యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు.

TSRTC మేనేజింగ్ డైరెక్ట్ VC సజ్జనార్ కూడా కార్పొరేషన్ ఉద్యోగులకు శుభాకాంక్షలు తెలిపారు. TSRTC యావత్ దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిందన్నారు. ప్రయాణికులకు అత్యుత్తమ సేవలందించడంలో సిబ్బంది నిర్విరామ కృషికి ఈ అవార్డులు నిదర్శనమని అన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios