Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతి పండగ వేళ TSRTC మరో శుభవార్త 

TSRTC: మహిళా ప్రయాణికులకు టీఎస్‌ఆర్టీసీ మరో శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండగకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్టు,ఆ ప్రత్యేక బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందని TSRTC ఎండీ సజ్జనార్ వెల్లడించారు. మరోవైపు అద్దె బస్సుల యజమానులతో చర్చలు సఫలం కాగా.. రేపటి నుంచి బస్సులు నడుస్తాయని తెలిపారు. 

TSRTC to run special buses for Sankranti KRJ
Author
First Published Jan 5, 2024, 3:41 AM IST

TSRTC: సంక్రాంతి సంబరాల సందర్భంగా స్వగ్రామాలకు వెళ్లే వారికి తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్‌ఆర్‌టీసీ) శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా  4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఈ బస్సులను జనవరి 6 నుండి 15 వరకు హైదరాబాద్ నుండి  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు నడపాలని ప్రణాళిక రూపొందించింది. అలాగే.. ఈ ప్రత్యేక బస్సులలోనూ మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కూడా వర్తిస్తుందనీ, కానీ రాష్ట్ర సరిహద్దుల వరకు మాత్రమేనని స్పష్టం చేసింది.

టిఎస్‌ఆర్‌టిసి మేనేజింగ్ డైరెక్టర్ విసి సజ్జనార్ మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. సంక్రాంతికి స్వగ్రామాలకు వెళ్లే వారిని సురక్షితంగా తన గమ్యస్థానాలకు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామని, ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎలాంటి పెంపుదల లేకుండా సాధారణ ఛార్జీలతో ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఆయన చెప్పారు.

ఉప్పల్ క్రాస్ రోడ్, ఎల్‌బి నగర్, ఆరామ్‌ఘర్, కెపిహెచ్‌బి వంటి ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే సాధారణ రద్దీ ప్రాంతాలలో బస్సులు ఎక్కేందుకు వేచి ఉన్న ప్రయాణికుల కోసం టిఎస్‌ఆర్‌టిసి అధికారులు ప్రత్యేక శిబిరాలను కూడా ఏర్పాటు చేశారనీ, తాగునీరు, మొబైల్ బయో-టాయిలెట్లు, అవసరమైన ప్రదేశాలలో ప్రయాణీకుల సౌకర్యం కోసం ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేయబడ్డాయని  సజ్జనార్ చెప్పారు.

బస్‌భవన్‌, మహాత్మాగాంధీ బస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ల ద్వారా రద్దీ ప్రాంతాల్లో పరిస్థితిని ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. టోల్ ప్లాజాల వద్ద టిఎస్‌ఆర్‌టిసి బస్సుల కోసం ప్రత్యేక లేన్‌లను ఏర్పాటు చేశారనీ, తద్వారా ప్రజలు తమ గమ్యస్థానాలకు త్వరగా చేరుకోవచ్చుననీ, పౌరులు ఆర్టీసీ బస్సుల్లో సురక్షితంగా ప్రయాణించాలని, అధిక ఛార్జీలు చెల్లించి ప్రైవేట్ బస్సుల్లో ప్రయాణించవద్దని అధికారులు కోరారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios