హైదరాబాద్: టీఎస్ ఆర్టీసి సమ్మె నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెసు నాయకుడు షబ్బీర్ అలీ తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ నాయకులు కోటీశ్వరులయ్యారని, ఉద్యమం చేసిన ఉద్యోగులు మాత్రం బికారులయ్యారని ఆయన అన్నారు.  రాష్ట్రంలో అతి పెద్ద కార్పోరేషన్  టీయస్ ఆర్టీసీ అని, రోజు కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుందని ఆయన చెప్పారు. 

కార్మికులు తమ సమస్యలపై అనేక సార్లు నోటీసులు ఇచ్చారని, కేసీఆర్ సీఎంగా కాకుండా పోలీస్ బాస్ లా వ్యవహరిస్తున్నారని, కార్మికుల ను బెదిరిస్తున్నారని ఆయన అన్నారు. కేసీఆర్ ను యూ టర్న్ ముఖ్యమంత్రిగా ఆయన అభివర్ణించారు. కేసీఆర్ లా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి ముఖ్యమంత్రి వ్యవహరిస్తే ఉద్యమం చేసే వాళ్లమా అని ఆయన అడిగారు. 

ఆర్టీసీ కార్మికులను పిలిచి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన కోరారు. కార్మికులను చర్చలకు పిలిచినంత మాత్రనా సీఏం విలువ ఏం తగ్దదని ఆయన అన్నారు. 

కార్మికుల ను డిస్మిస్ చేస్తా అంటె ..ప్రజలు మిమ్మల్ని డిస్మిస్ చేస్తారని గుర్తుుంచుకోవాలని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. ప్రజలకు ఇబ్బంది కాకుండా తొందరగా సమస్య పరిష్కరించాలని ఆయన అన్నారు. ఆర్టీసీ కార్మికుల పక్షాన కాంగ్రెస్ ఉంటుందని చెప్పారు. సమ్మె కు పూర్తి మద్దతు కాంగ్రెస్ ప్రకటిస్తుందని చెప్పారు.

నిన్న ప్రధాన మోడీ ని కలసిన సీఎం  వెనకబడిన జిల్లాలకు నిధులు అడుగుతున్నారని, గతంలో వెనకబడిన జిల్లా లకు డబ్బులు అవసరం లేదని అన్నారని ఆయన గుర్తు చేశారు. ధనిక రాష్ర్టమని చెప్పి,నీతి అయోగ్ లో తమకు డబ్బులు కావాలని అడుగుతున్నారని ఆయన అన్నారు. 

16 ఏప్రిల్ 2017లో మైనారిటీ, ఎస్టీ రిజర్వేషన్ పై ఏకగ్రీవ తీర్మానం చేశారు గానీ ఇంతవరకు ఎక్కడ అమలు కాలేదని ఆయన అన్నారు. ప్రధాని కి 23డిమాండ్ లు పెట్టినప్పుడు తము డిమాండ్ ఎందుకు పెట్టలేదని మైనారిటీ ,ఎస్టీ లు ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. 

హుజూర్ నగర్ లో మైనారిటీ ,ఎస్టీ లు కాంగ్రెస్ కు ఓటు వేయాలని షబ్బీర్ అలీ కోరారు. ఆర్టీసీ, నిరుద్యోగులు‌, యూనివర్సిటీ  లు ఆసుపత్రులంటే ఈ ముఖ్యమంత్రి కి ఎలర్జీ అని ఆయన వ్యాఖ్యానించారు. 

తొక పార్టీ లు అన్న వాళ్ళే తొక పార్టీ ని కలుపుకున్నారని ఆయన సిపిఐని ఉద్దేశించి అన్నారు. కేటీఆర్ ది నోరు కాదు మోరి ఆయన అన్నారని, సీపీఐ డిమాండ్లంన్నింటికి ఓప్పుకున్నామని కేకే అన్నారని ఆయన గుర్తు చేస్తూ ఆ డిమాండ్లేమిటో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. పార్లమెంట్ లో అన్ని బిల్లులకు టిఆర్ఎస్ మద్దతు ఇచ్చిందని, బీజేపీ ,టిఆర్ఎస్ లు ఓక్కటేనని ఆయన అన్నారు.