Asianet News TeluguAsianet News Telugu

ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్ చెప్పిన సజ్జనార్.. ఆ సెంటర్లలో యూపీఐ సేవలు..

తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు టీఎస్‌ఆర్టీసీలో (TSRTC) యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని చెప్పారు.

TSRTC MD VC Sajjanar request citizens to utilize upi mobile payments at mgbs and jbs
Author
Hyderabad, First Published Oct 25, 2021, 4:10 PM IST

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు చేపట్టిన సజ్జనార్.. తనదైన మార్క్‌ను కనబరుస్తున్నారు. ఆర్టీసీని గాడిలో పెట్టేందుకు, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వినూత్న కార్యక్రమాలను చేపడుతున్నారు. ట్విట్టర్‌లో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రయాణికుల నుంచి వస్తున్న అభ్యర్థనలపై స్పందిస్తున్నారు.  హైదరాబాద్ నగరంలోని సిటీ బస్సులో సాధారణ ప్రయాణికుడిగా టికెట్ తీసుకుని ప్రయాణం చేశారు. ఈ సమయంలో బస్సుల్లో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుడా MGBS పరిసరాలను పరిశీలించారు. అక్కడ ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వినాయక నిమజ్జనానికి కూడా Sajjanar ఫ్యామిలీతో పాటు ఆర్టీసీ బస్సులో ప్రయాణించి సింప్లిసిటీ చాటుకున్నారు. 

ఇటీవల దసరా పండగ సందర్భంగా స్పెషల్ బస్సుల్లో అదనపు చార్జీలను రద్దు చేశారు. ప్రయాణికులు.. ప్రైవేటు వాహనాల్లో కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించేలా తనదైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ క్రమంలోనే తాజాగా సజ్జనార్ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పారు. ప్రజల నుంచి వచ్చిన విజ్జప్తి మేరకు టీఎస్‌ఆర్టీసీలో యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా పెమేంట్స్ చేసే సదుపాయాన్ని పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించామని చెప్పారు.

Also read: ఆనందయ్య దరఖాస్తును వెంటనే పరిశీలించండి.. ఏపీ హైకోర్టు ఆదేశం..

అయితే ప్రస్తుతం ఇది Hyderabad నగరంలోని కొన్ని చోట్ల మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఎంజీబీఎస్‌లోని టికెట్ రిజర్వేషన్ సెంటర్, పార్సిల్ అండ్ కార్గొ సెంటర్‌లో యూపీఐ/క్యూఆర్‌ కోడ్ ద్వారా చెల్లింపులు చేసేందుకు అవకాశం కల్పించారు. అదే విధంగా జూబ్లీ బస్ స్టేషన్‌లోని టికెట్ రిజన్వేషన్ కౌంటర్, బస్ పాస్ కౌంటర్‌, పార్సిల్ అండ్ కార్గొ సెంటర్‌లలో, రేతిఫైల్ బస్ స్టేషన్‌లో కూడా ఈ సేవలను ప్రారంభిస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

Also read: నీట్ పీజీ కౌన్సిలింగ్‌కు బ్రేక్.. కేంద్రానికి సుప్రీం కోర్టు ఆదేశాలు..

ప్రయాణికులు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. తొలుత వీటిని పరిశీలించిన తర్వాత.. ఈ సేవలను తెలంగాణ అంతటా విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నామని సజ్జనార్ చెప్పారు. ప్రతి ఒక్కరు ఈ సేవలను ఉపయోగించుకుని.. గ్రాండ్ సక్సెస్ చేయాలని కోరారు. ఇందుకు సంబంధించి ఏమైన సలహాలు, సూచనలు ఉంటే కూడా చెప్పాలని కోరారు.  డిజిటలైజేషన్‌కు ప్రాధాన్యత ఏర్పడిన సమయంలో.. ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సజ్జనార్ తీసుకున్న నిర్ణయంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios