Asianet News TeluguAsianet News Telugu

అర్ధరాత్రి TSRTC కి ట్వీట్ చేసిన యువతి.. వెంటనే స్పందించిన సజ్జనార్...

మహిళలకు కలుగుతున్న ఈ అసౌకర్యంపై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ retweet చేశారు. అర్ధరాత్రి సైతం మహిళల సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా అనే ఆ యువతి ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపింది 

TSRTC MD Sajjanar responded immediately at midnight to a woman tweet
Author
Hyderabad, First Published Jan 12, 2022, 10:11 AM IST

హైదరాబాద్ : అర్ధరాత్రి TSRTC కి ట్వీట్ ఓ యువతి ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ కు RTC MD vc sajjanar వెంటనే స్పందించారు. అర్ధరాత్రి సమయాలలో RTC బస్సులలో మహిళల సౌకర్యం కోసం ( వాష్ రూమ్స్ ) బస్సులను పెట్రోల్ పంప్ లలో 10 నిమిషాలు బస్సు ఆపాలని పాలే నిషా అనే యువతి కోరింది.

washroomల దగ్గర ఆపకపోవడంతో.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే మహిళలు ఇబ్బందులు పడుతున్నారని యువతి తెలిపింది. అయితే ఆమె tweet చేసిన వెంటనే ఆ ట్వీట్ కు ఎండి సజ్జనార్ రీట్వీట్ చేశారు. ఇలా వెంటనే అర్ధరాత్రి చేసిన ట్వీట్ కి ఆర్టీసీ ఎండి సజ్జనార్ స్పందించడం విశేషంగా మారింది.

మహిళలకు కలుగుతున్న ఈ అసౌకర్యంపై అధికారులకు సూచించినట్లు సజ్జనార్ retweet చేశారు. అర్ధరాత్రి సైతం మహిళల సమస్యపై సజ్జనార్ స్పందించడంతో పాలే నిషా అనే ఆ యువతి ఆనందం వ్యక్తం చేసి, కృతజ్ఞతలు తెలిపింది 

ఇదిలా ఉండగా, టీఎస్ ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ స‌జ్జ‌నార్ బాధ్య‌తలు స్వీక‌రించిన నాటి నుంచి ఆ సంస్థ‌లో మార్పులు మొద‌ల‌య్యాయి. ప్ర‌తీ విష‌యంలోనూ ఆయ‌న మార్క్ నిర్ణ‌యాలు క‌నిపిస్తున్నాయి. ఇటీవ‌లే మ‌హిళ సిబ్బందికి రాత్రి 8 దాటిన త‌రువాత డ్యూటీలు వేయ‌డం నిషేదించారు. మౌఖికంగా చెప్పిన త‌రువాత ఆ ఆదేశాలు అమలు కాలేదు. ఈ విష‌యం ఆయ‌న దృష్టికి వ‌చ్చిన వెంట‌నే ఉత్త‌ర్వులు జారీ చేశారు. 

దీంతో రాత్రి స‌మ‌యంలో కండ‌క్ట‌ర్ గా విధులు నిర్వ‌హించే మ‌హిళ‌ల ఇబ్బందులు తొల‌గిపోయాయి. అలాగే హైద‌రాబాద్ ప‌రిధిలో క్రిస్మ‌స్, డిసెంబ‌ర్ 31 రాత్రి సంద‌ర్భంగా ప్ర‌త్యేక బ‌స్సులు న‌డిపేలా నిర్ణ‌యం తీసుకున్నారు. జ‌న‌వ‌రి 1వ తేదీ సంద‌ర్భంగా తెలంగాణ వ్యాప్తంగా చిన్నారుల‌కు బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం క‌ల్పించారు. 

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఎండీ స‌జ్జ‌నార్... ఆ వేదిక ద్వారా త‌న దృష్టికి వ‌చ్చే అన్ని స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తున్నారు. ప్ర‌తీ సారి ద‌స‌రా స‌మ‌యంలో ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సుల పేరుతో ఛార్జీలు పెంచుతూ వ‌స్తోంది. అయితే ఈ సారి మాత్రం అలా జ‌ర‌గ‌లేదు. అలాగే రూల్స్ పాటించ‌ని అధికారుల విష‌యంలో కూడా చాలా స్ట్రిక్ట్‌గా ఉంటున్నారు స‌జ్జ‌నార్‌.  ఇటీవ‌ల ఆర్టీసీ బ‌స్సులో జ‌న్మించిన ఇద్ద‌రికీ జీవితాంతం బ‌స్ ఫ్రీగా ఇచ్చారు. 

బ‌స్టాండ్ ప్రాంగ‌ణంలోని ఎంఆర్‌పీ కంటే ఎక్కువ‌గా వ‌స్తువుల‌ను అమ్ముతున్న స్టాల్స్‌పై రూ.ల‌క్ష ఫైన్ విధించారు. అలాగే హైద‌రాబాద్ ప‌రిధిలో ఫొన్ చేస్తే ఇంటికే బ‌స్ పాస్ తీసుకొచ్చే విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. ఇలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రిస్తూ, కొత్త కొత్త విధానాలను ప్ర‌వేశ‌పెడుతూ త‌న‌దైన మార్క్ చూపిస్తున్నారు. సజ్జనార్ ఎండీగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన త‌రువాత టీఎస్ ఆర్టీసీపై ప్రయాణికుల్లో సంతృప్తి పెరుగుతోంది. 

ఈ క్రమంలోనే జనవరి ఒకటిన తెలంగాణ ఆర్టీసీలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిని పర్మినెంట్ చేస్తామంటూ వస్తున్న వార్తలపై టీఎస్ఆర్టీసీ స్పందించింది. ఆ వార్తలన్నీ అవాస్తవమని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలను నమ్మొద్దని సిబ్బందికి సూచించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios