Huzurabad bypoll Result 2021 : ఈటెల గెలుపుతో టిఆర్ఎస్ కు యూటర్న్ తప్పదు.. మాజీ టిఎస్ ఆర్టీసీ చైర్మన్ (వీడియో)
ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి kcr ఓటుకు 10 వేల చొప్పున వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సోమారపు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు మొదటి అడుగు పడిందని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు.
కుటుంబ పాలనలో కుంటుపడ్డ తెలంగాణ విముక్తికి ఇంకా ఎంతో దూరం లేదని హుజురాబాద్ ఎన్నిక రుజువు చేసిందని మాజీ టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ పేర్కొన్నారు.
"
హుజురాబాద్ లో ఈటెల గెలుపుతో పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో బిజెపి నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. స్వీట్స్ పంచుతూ సందడి చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నికలో కమలం వికసించిందని... ఈటెల రాజేందర్ గెలుపు కృషి చేసిన ప్రతి ఒక్కరికి somarapu satyanarayana కృతజ్ఞతలు తెలిపారు.
ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి kcr ఓటుకు 10 వేల చొప్పున వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సోమారపు ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడేందుకు మొదటి అడుగు పడిందని రాబోయే ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగవుతుందన్నారు.
బిజెపి పాలనలో రాష్ట్రం సుభిక్షంగా మారుతుందని... ప్రధాని మోడీ ఆశయ సాధనలో ప్రతి కార్యకర్త పని చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈటెల గెలుపుతో టిఆర్ఎస్ కు యూటర్న్ తప్పదని సత్యనారాయణ అన్నారు.
Huzurabad bypoll Result 2021... కాంగ్రెస్ లో 'చిచ్చు', రేవంత్‌పై సీనియర్ల ముప్పేట దాడి
ప్రజలే తగిన బుద్ది చెప్పారు...ఈటెల
ఇదిలా ఉండగా..హుజూరాబాద్ ఎన్నికల్లో తన గెలుపు కేసీఆర్ అహంకారంపై తెలంగాణ ప్రజలు సాధించిన విజయంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభివర్ణించారు. హుజూరాబాద్ ప్రజలు కేసీఆర్ కు తగిన బుద్ది చెప్పారన్నారు.
బుధవారం నాడు హుజూరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్ఎస్ నుండి తనను వెళ్లగొట్టాక బీజేపీ అక్కున చేర్చుకొందని Etela Rajender చెప్పారు. Amit shahపిలిచి అండగా ఉంటామని మొదటగా హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేసుకొన్నారు.
తనకు అండదండలు అందించిన అమిత్ షా కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. Bjp జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా తన గెలుపులో కీలకంగా వ్యవహరించారని ఆయన చెప్పారు.
Huzurabad bypoll లో ఓటర్లను Trs నేతలు ప్రలోభపెట్టేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేసిందన్నారు. అయినా కూడా ఓటర్లు చైతన్యవంతంగా వ్యవహరించి టీఆర్ఎస్ కు బుద్ది చెప్పారని ఈటల రాజేందర్ చెప్పారు.
దళిత బంధు పథకం కింద వచ్చే రూ. 10 లక్షలకు తాము అమ్ముడుపోమని దళితులు తనకు చెప్పారని రాజేందర్ తెలిపారు. కుల సంఘాలతో అందరికీ డబ్బులిచ్చారన్నారు. అయినా కూడా ఎవరూ లొంగలేదని రాజేందర్ చెప్పారు.
టీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్న సమయంలో ఈ నియోజకర్గంలోని సుమారు 40 గ్రామాల ప్రజలు వారిని తన్ని తరిమివేశారన్నారు.కుట్రదారుడు కుట్రల్లోనే నాశనం అయిపోతాడని పరోక్షంగా ఈటల రాజేందర్ కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
కుట్రలు చేసిన వారికి ఏనాడూ కూడా మంచి జరగదని ఆయన చెప్పారు. దమ్ముంటే, ధైర్యం ఉంటే నీవు కానీ నీ అల్లుడిని కానీ పోటీ చేయాలని తాను చేసిన సవాల్ ను ఎందుకు స్వీకరించలేదని కేసీఆర్ ను ప్రశ్నించారు.. తనపై శ్రీనివాస్ యాదవ్ ను పోటీకి రెండు గుంటల వ్యక్తి అంటూ ప్రచారం చేశారని రాజేందర్ చెప్పారు. అయితే రెండు గుంటల వ్యక్తి అయతే రూ. 400 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ఆయన టీఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు.