ప్రైవేట్ వాటితో పోలిస్తే టి.ఎస్.ఆర్టీసీ కార్గో ఛార్జీలు సమంజసంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర , రాష్ట్రతర ప్రాంతాలకు సరకు రవాణాకు సంబంధించిన బుకింగ్ , డెలివరీ సదుపాయాలతో పాటు వేగంగా , భద్రంగా సేవలు కొనసాగుతుండటంతో ఆదరణ చూరగొంటోంది. 

సంస్థకు అదనపు ఆదాయం సమకూర్చడానికి టి.ఎస్.ఆర్టీసీ కార్గో పలు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు సలహా మేరకు , రవాణా శాఖ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ సూచనలతో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గంగా కార్గో, పార్శిల్ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 

ఈ క్రమంలో సరికొత్త వ్యూహాలతో కార్గో విభాగం కార్యాచరణ దిశగా అడుగులు వేస్తోంది. దీంతో కార్గో, పార్శిల్ సేవలు వినియోగదారులకు మరింత చేరువ అయ్యాయి.

పొరుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న సేవలు మరింత త్వరితగతిన అందే విధంగా టి.ఎస్.ఆర్టీసీ తగు కార్యాచరణను అమలుపరుస్తోంది. వ్యాపార కేంద్రాలైన విజయవాడ , విశాఖపట్నం పట్టణాలకు నేరుగా నిత్యం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్ పోర్ట్ మీదుగా కార్గో సర్వీసులను నడుపుతోంది. 

10 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన కార్గో వాహనాలను పటాన్ చెరువు, మెహిదీపట్నం, లక్డీకాపూల్, సి.బి.ఎస్ నుంచి ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. 

హైదరాబాద్ లో బయలుదేరిన కార్లో కనెక్టెడ్ పాయింట్లు కోదాడ , సూర్యాపేట , విజయవాడ , రాజమండ్రి , అన్నవరం , తుని మీదుగా విశాఖపట్నం చేరుకోనుంది. అలాగే, ఎ.పి నుంచి కూడా వినియోగదారులు కార్లోను ఉపయోగించుకునే విధంగా తారిఫ్ రేట్లను వినియోగదారులకు అందుబాటులో ఉంచారు.

ప్రైవేట్ వాటితో పోలిస్తే టి.ఎస్.ఆర్టీసీ కార్గో ఛార్జీలు సమంజసంగా ఉండటంతో వినియోగదారులు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు. రాష్ట్ర , రాష్ట్రతర ప్రాంతాలకు సరకు రవాణాకు సంబంధించిన బుకింగ్ , డెలివరీ సదుపాయాలతో పాటు వేగంగా , భద్రంగా సేవలు కొనసాగుతుండటంతో ఆదరణ చూరగొంటోంది. 

వినియోగదారుల డిమాండ్ మేరకు కార్గో సేవలు ఉన్నాయని ప్రత్యేక అధికారి ఎస్.కృష్ణకాంత్ అన్నారు. వ్యాపారులకు , వినియోగదారులకు మధ్య ఒక పటిష్టమైన సరుకు రవాణా వ్యవస్థగా టి.ఎస్ . ఆర్టీసీ కార్గో పని చేస్తోందని ప్రత్యేక అధికారి ఎన్ . కృష్ణకాంత్ తెలిపారు .ఇల్లు మారడం, గృహ నిర్మాణం, పరిశ్రమలకు సంబంధించిన వస్తువులు, పర్నీచర్‌తో పాటు ఇతరత్రా వస్తు సామాగ్రీలను తరలించేందుకు ఈ ప్రత్యేక కార్లో అందుబాటులో ఉందని చెప్పారు. 

దూరం, వస్తు పరిమాణం బట్టి నిర్దిష్టంగా ఒకే రకమైన ధరలు నిర్ణయించామని , సరుకులను అత్యంత వేగంగా చేరవేసేందుకు గానూ ఈ సేవలు వినియోగదారులకు ఎంతో ఉపకరిస్తాయన్నారు. పూర్తి సమాచారం కోసం https://www.tsrtc.telangana.gov.in ( పార్శిల్ అండ్ కార్గో సర్వీస్ ) వెబ్ సైట్ ను చూడవచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని సంస్థను ఆదరించాలని ఆయన కోరారు .