Asianet News TeluguAsianet News Telugu

సంక్రాంతికి టీఎస్‌ ఆర్టీసీ బంపర్‌ ఆఫర్‌.. టికెట్స్‌పై డిస్కౌంట్.. వివరాలు ఇవే..

సంక్రాంతి పండుగ‌కు సొంతూర్ల‌కు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ బంరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,233 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా ప్రయాణికులు ఆర్టీసీ మరో శుభవార్త కూడా చెప్పింది.

TSRTC announces 10 percent concession on round trip for Sankranti
Author
First Published Dec 27, 2022, 11:23 AM IST

సంక్రాంతి పండుగ‌కు సొంతూర్ల‌కు వెళ్లే వారికి తెలంగాణ ఆర్టీసీ బంరాఫర్ ప్రకటించింది. ఇప్పటికే సంక్రాంతి పండుగ వేళ రద్దీని దృష్టిలో ఉంచుకుని 4,233 ప్రత్యేక బస్సు సర్వీసులను నడపాలని ఆర్టీసీ నిర్ణయించింది. తాజాగా ప్రయాణికులు ఆర్టీసీ మరో శుభవార్త కూడా చెప్పింది. అయితే త‌మ సొంతూర్ల‌కు వెళ్ల‌డం కోసం టికెట్ బుకింగ్ చేసుకున్న‌ప్పుడే.. తిరుగు ప్ర‌యాణం టికెట్ కూడా బుక్ చేసుకుంటే.. తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు సోమవారం ప్రకటించింది. ఈ రాయితీ డీల‌క్స్, సూప‌ర్ ల‌గ్జ‌రీ, రాజ‌ధాని, గ‌రుడ ప్ల‌స్ బ‌స్సుల్లో క‌ల్పించినట్టుగా తెలిపింది. ఈ ఆఫ‌ర్ జ‌న‌వ‌రి 31వ తేదీ వ‌ర‌కు వ‌ర్తించ‌నుంద‌ని పేర్కొంది. 

సంక్రాంతి సందర్భంగా ప్ర‌యాణికులపై ఆర్థికభారం తగ్గించేందుకు తిరుగు ప్ర‌యాణంపై 10 శాతం డిస్కౌంట్ క‌ల్పించిన‌ట్లు ఆర్టీసీ చైర్మ‌న్ బాజిరెడ్డి గోవ‌ర్ధ‌న్, ఎండీ వీసీ సజ్జ‌నార్ పేర్కొన్నారు. ముందస్తు రిజర్వేషన్ కోసం ప్రయాణీకులు  www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. 

ఇదిలా ఉంటే, ఇటీవల సజ్జనార్ మాట్లాడుతూ.. గత సంక్రాంతి సందర్భంగా 3,736 ప్రత్యేక బస్సు సర్వీసులు నడపగా.. ఈసారి 10 శాతం అధికంగా బస్సులు నడుపుతున్నామని తెలిపారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్‌డ్‌ టికెట్‌ బుకింగ్‌ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచినట్లు చెప్పారు. అడ్వాన్స్‌డ్ బుకింగ్ సౌకర్యం వచ్చే ఏడాది జూన్ వరకు 60 రోజుల వరకు అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని ఆయన కోరారు.

Follow Us:
Download App:
  • android
  • ios