Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కొనసాగుతోన్న కొలువుల జాతర.. 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ఖాళీగా వున్న 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ,గ్రూప్ 4, పోలీస్, మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే.

tspsc released notification for recruiting 544 assistant professor posts
Author
First Published Dec 31, 2022, 9:19 PM IST

తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. ఇప్పటికే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ,గ్రూప్ 4, పోలీస్, మెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా శనివారం 544 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో 23 ఇంగ్లీష్, 27 తెలుగు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కూడా వున్నాయి. 

కాగా.. నిన్న  రాష్ట్రంలో ఖాళీగా వున్న 5,204 స్టాఫ్ నర్సుల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే . అర్హులైన అభ్యర్ధులు జనవరి 25 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది. తెలంగాణ మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా నియామకాలు జరుపుతామని వెల్లడించింది. డీఎంఈ, డీహెచ్ పరిధిలో 3,823 పోస్టులు.. వైద్య విధాన పరిషత్‌లో 757 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆ కాసేపటికే 1365 గ్రూప్ 3 పోస్టులకు కూడా ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ తెలిపింది. 

Also REad: అర్థరాత్రి నుంచి ప్రారంభమైన గ్రూప్ 4 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ.. తగ్గిన 1129 పోస్టులు...

ఇదిలావుండగా.. సాంకేతిక కారణాలతో వాయిదా పడిన గ్రూప్ 4 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎట్టకేలకూ ప్రారంభమయ్యింది. శుక్రవారం అర్థరాత్రినుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్లీ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లంస్ రాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. దీనికోసం సీజీజీ అధికారులతో కలిసి కమిషన్ అధికారులు శుక్రవారం రాత్రి వరకు కసరత్తు చేశారు. పూర్తిగా ఎలాంటి సమస్యలు తలెత్తవని కన్ ఫర్మ్ అయ్యాక శుక్రవారం రాత్రి 11.45 గంటలకు అందుబాటులోకి దరఖాస్తులను తెచ్చారు. 

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా.. అంతా సకాలంలో పూర్యయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. అయితే మొదట గ్రూప్ 4 ప్రకటన 9168 పోస్టులకు పడింది.అయితే, దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడడంతో పాటు పోస్టుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం 8039 పోస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వెబ్ సైట్ లో వీలవుతుంది. అంటే దాదాపు 1129 పోస్టులు తగ్గించారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖలో ఇవి తగ్గినట్టు తెలుస్తోంది. అందులో ఉన్న 1245 పోస్టులకు గాను.. కొన్నిటికి మాత్రమే పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు అందించింది. 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 23న ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండే.తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. గ్రూప్-4 ఉద్యోగాలకు డిసెంబర్ 23 నుండి ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరిస్తామని ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది.ఈ మేరకు ఆన్ లైన్ దరఖాస్తులకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 30నుంచి జనవరి 19వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

Follow Us:
Download App:
  • android
  • ios