Asianet News TeluguAsianet News Telugu

అర్థరాత్రి నుంచి ప్రారంభమైన గ్రూప్ 4 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ.. తగ్గిన 1129 పోస్టులు...

ఎట్టకేలకూ సాంకేతిక కారణాలను అధిగమనించి గ్రూప్-4 ఉద్యోగాలకు ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ శుక్రవారం అర్థరాత్రి నుంచి ప్రారంభమయ్యింది. 

Group 4 online application process started, 1129 posts reduced
Author
First Published Dec 31, 2022, 7:28 AM IST

హైదరాబాద్ : సాంకేతిక కారణాలతో వాయిదా పడిన గ్రూప్ 4 ఆన్ లైన్ దరఖాస్తుల ప్రక్రియ ఎట్టకేలకూ ప్రారంభమయ్యింది. శుక్రవారం అర్థరాత్రినుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మళ్లీ ఎలాంటి టెక్నికల్ ప్రాబ్లంస్ రాకుండా ముందస్తుగా అన్ని జాగ్రత్తలూ తీసుకున్నారు. దీనికోసం సీజీజీ అధికారులతో కలిసి కమిషన్ అధికారులు శుక్రవారం రాత్రి వరకు కసరత్తు చేశారు.  పూర్తిగా ఎలాంటి సమస్యలు తలెత్తవని కన్ ఫర్మ్ అయ్యాక శుక్రవారం రాత్రి 11.45 గంటలకు అందుబాటులోకి దరఖాస్తులను తెచ్చారు. 

టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి ఈ ప్రక్రియలో ఎలాంటి సమస్యలు లేకుండా.. అంతా సకాలంలో పూర్యయ్యేలా పర్యవేక్షిస్తున్నారు. అయితే మొదట గ్రూప్ 4 ప్రకటన 9168 పోస్టులకు పడింది. అయితే, దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడడంతో పాటు పోస్టుల సంఖ్య కూడా తగ్గింది. ప్రస్తుతం 8039 పోస్టులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి వెబ్ సైట్ లో వీలవుతుంది. అంటే దాదాపు 1129 పోస్టులు తగ్గించారు. ముఖ్యంగా పంచాయితీ రాజ్ శాఖలో ఇవి తగ్గినట్టు తెలుస్తోంది. అందులో ఉన్న 1245 పోస్టులకు గాను.. కొన్నిటికి మాత్రమే పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదనలు అందించింది. 

ఇదిలా ఉండగా, డిసెంబర్ 23న ఈ ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండే. తెలంగాణలో నిరుద్యోగులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. గ్రూప్-4 ఉద్యోగాలకు డిసెంబర్ 23 నుండి ఆన్ లైన్ లో అప్లికేషన్లను స్వీకరిస్తామని ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఇది వాయిదా వేస్తున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ మేరకు ఆన్ లైన్ దరఖాస్తులకు కొత్త తేదీలను టీఎస్పీఎస్సీ తెలిపింది. ఈ నెల 30నుంచి జనవరి 19వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. 

టీడీపీతో పొత్తు వుంటుందా , లేదా .. బీజేపీ సమావేశంలో విజయశాంతి వ్యాఖ్యలు , బండి సంజయ్ క్లారిటీ

కాగా, ప్రభుత్వంలోని మొత్తం 25 వివిధ విభాగాల పరిధిలో 9,168 పోస్టులకు టిఎస్పిఎస్సి ఇప్పటికే ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. అప్లికేషన్ పెట్టుకోవడానికి మూడు వారాల గడువు ఇచ్చింది. ఈ అప్లికేషన్ లను పరిశీలించిన తర్వాత ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష ఉంటుందని.. అది ఏప్రిల్ లేదా మే నెలలో పరీక్షలు నిర్వహిస్తామని ఇప్పటికే కమిషన్ వెల్లడించింది. 9,168 గ్రూపు -4 ఉద్యోగాలు దీనిద్వారా భర్తీ కానున్నాయి. ఈ ఉద్యోగాల్లో 2,701 పురపాలక శాఖ పరిధిలోని పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మొత్తం ఉద్యోగాల్లో ఇవే ఎక్కువ శాతం ఉన్నాయి. 

ఇక రెవెన్యూ శాఖ పరిధిలో 2077 పోస్టులు ఉన్నాయి. వీటిలో కూడా  సీసీఎల్ఏ పరిధిలో 1,294  పోస్టులు ఉన్నాయి. సంక్షేమ గురుకులాల్లో,  సాధారణ గురుకులాల్లో  1991 పోస్టులు  ఖాళీలు ఉన్నాయి. ఇక వివిధ ప్రభుత్వ విభాగాల్లో కలిపి మొత్తం 6,859 జూనియర్ అసిస్టెంట్ పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 1,862 వార్డు అధికారులు పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు.. ఈ గ్రూప్-4  ప్రక్రియ ద్వారా భర్తీ కానున్నాయి. చాలా కాలం తర్వాత గ్రూప్-4 దరఖాస్తులు స్వీకరిస్తుండడంతో.. భారీ సంఖ్యలో అప్లికేషన్లు వస్తాయని  కమిషన్  అంచనావేస్తోంది. కనీసం ఆరేడు లక్షల మధ్యలో అప్లికేషన్లు రావచ్చని  గత అనుభవాలను బట్టి  అంచనా వేస్తున్నారు. 

నాలుగేళ్ల క్రితం 2018లో రాష్ట్రవ్యాప్తంగా 700 వీఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తే దాదాపు పది లక్షల మందికిపైగా అప్లై చేసుకున్నారు.  వీరిలో 76 శాతం మంది పరీక్షకు హాజరయ్యారు. అంతేకాదు, అంతకు ముందు గ్రూప్ ఫోర్ కేటగిరీలో రెండు వేల లోపు పోస్టులతో ప్రకటన వెలువడిన అప్పుడు కూడా 4.8 లక్షల మంది అప్లై చేసుకున్నారు. ఈ రెండింటికి మించి ప్రస్తుతం దాదాపు పదివేల పోస్టులు.. 9,168 పోస్టులకు  నోటిఫికేషన్ జారీ చేయడంతో.. మరింత భారీ స్థాయిలో అభ్యర్థులు అప్లికేషన్లు పెడతారని  ఊహిస్తున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios