Asianet News TeluguAsianet News Telugu

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసు: చార్జీషీట్ దాఖలు చేయనున్న సిట్

టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  త్వరలోనే  సిట్ చార్జీషీట్ దాఖలు  చేయనుంది.  
 

 TSPSC  Paper leak Case: SIT  To file  Charge Sheet  in Court  lns
Author
First Published Jun 7, 2023, 5:30 PM IST

హైదరాబాద్:  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీక్  కేసులో  వచ్చే వారంలో  సిట్ చార్జీషీట్  దాఖలు  చేసే అవకాశం ఉంది.   చార్జీషీట్ దాఖలు  చేయడానికి గాను  సిట్  న్యాయ సలహా తీసుకోనుంది.

చార్జీషీట్ లో  37 మంది  పేర్లను  సిట్ దాఖలు  చేసే అవకాశం ఉంది.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్  స్కాంలో  ఇప్పటికే  54 మందిని సిట్ అరెస్ట్  చేసింది. అరెస్టైన వారిలో  15 మంది బెయిల్ పై విడుదలయ్యారు.  ఈ కేసులో  ప్రధాన నిందితులు   ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలు  ఇంకా  జైలులోనే  ఉన్నారు.ఈ కేసులో  ఇతరులపై  అభియోగాలను  అనుబంధ చార్జీషీట్లలో  పొందుపర్చనుంది సిట్.  టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో  ఒకరిని అరెస్ట్  చేస్తే  మరొకరికి  ఈ కేసుతో సంబందం  బయటపడుతుంది. 

వరంగల్ జిల్లాలో డీఈగా  పనిచేసిన రమేష్  ను అరెస్ట్  చేసిన తర్వాత   మరిన్ని విషయాలు వెలుగు చూశాయి.  టీఎస్‌పీఎస్ సీ  పరీక్షల్లో  ఎలక్ట్రానిక్ డివైజ్లతో  అభ్యర్ధులతో  పరీక్షుల రాయించిన  విషయంవెలుగు  చూసింది.  సుమారు  80 మంది అభ్యర్ధులతో   రమేష్  ఒప్పందం చేసుకున్నారని సిట్  గుర్తించింది. 

also read:టీఎస్‌పీఎస్‌సీ పేపర్ల మాల్ ప్రాక్టీస్‌తో రూ. 10 కోట్ల టార్గెట్: డీఈ రమేష్ కస్టడీకి సిట్ పిటిషన్

ఈ ఏడాది మార్చి మాసంలో  టీఎస్‌పీఎస్  పేపర్ లీక్ అంశం వెలుగు చూసింది.  తొలుత  టీఎస్‌పీఎస్ సీ లో  కంప్యూటర్లు  హ్యాక్ అయ్యాయని  భావించారు. కానీ  పోలీసుల విచారణలో  పేపర్లు లీకయ్యాయని  తేలింది.

Follow Us:
Download App:
  • android
  • ios