తెలంగాణలో గ్రూప్ -1 ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తుంది. రెండు రోజుల్లో నోటిఫికేషన్ జారీ చేయనుంది.
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో group-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సన్నాహాలు చేస్తుంది. రెండు రోజుల్లో ఈ విషయమై notification ను జారీ చేయనుంది. రాష్ట్రంలోని పది ప్రభుత్వ శాఖల్లోని 503 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఖాళీల భర్తీపై అందిన ప్రతిపాదలనలపై బోర్డు క్షుణ్ణంగా పరిశీలించి ఆమోదం తెలిపింది. ఆయా పోస్టులకు విద్యార్హత, వయసు తదితర అంశాలను పరిశీలించింది TSPSC. మరో మూడు అంశాలపై ప్రభుత్వం నుండి ఆమోదం తెలపాల్సి ఉంది. టీఎస్‌పీఎస్‌సీ శనివారం నాడు సమావేశమైంది.ఈ సమావేశంలో గ్రూప్ -1 పోస్టుల భర్తీపై చర్చించనుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెలువడిన పోస్టుల కంటే Telangana రాష్ట్రంలో గ్రూప్ -1 విభాగంలో అత్యధిక పోస్టులను భర్తీ చేయనున్నారు. గ్రూప్ -1 లో 503 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు ప్రభుత్వం జీవో ను జారీ చేసింది. అయితే ఈ దఫా గ్రూప్ -1 పోస్టుల భర్తీ చేసే సమయంలో ఇంటర్వ్యూలను రద్దు చేశారు. తొమ్మిది నెలల్లోనే ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షలు పూర్తి చేసి పోస్టింగ్ లు ఇవ్వాలని కూడా కమిషన్ భావిస్తుంది. ఇంటర్వ్యూలు ఎత్తివేస్తున్నట్టుగా ప్రకటించడంతో గ్రూప్ -1 పరీక్షా విధానంలో కూడా మార్పులు చేయనున్నారు. 900 మార్కుల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
గతంలో గ్రూప్ -1 కేటగిరిలో లేని విభాగాల పోస్టులను ఈ దపా గ్రూప్ 1 లో చేర్చారు. రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారంగా రాష్ట్ర కేడర్ పోస్టులు మల్టీ జోనల్ స్థాయికి మారాయి. ఈ విషయాలపై ప్రభుత్వం నుండి నిర్ణయం వెలువడాల్సి ఉంది. ఈ విషయమై రెండు రోజుల్లో ప్రభుత్వం నుండి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం నుండి స్పష్టత రాగానే టీఎస్ పీ ఎస్ సీ గ్రూప్ -1 పరీక్షలకు సంబంధించి నోటీఫికేషన్ జారీ చేయనున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో 80వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఈ విషయాన్ని కేసీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రసంగం చేసిన రోజు నుండే ఆయా శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్లు జారీ చేయనున్నట్టుగా ప్రకటించారు. అయితే ఈ ప్రకటన చేసి సుమారు 45 రోజులు అవుతుంది. అయితే ఉద్యోగ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రక్రియ ప్రారంభమైంది.
ఆర్ధిక శాఖ నుండి అనుమతులు తీసుకోవడం వంటి వాటి కోసం నోటిఫికేషన్ జారీ చేయడం ఆలస్యమౌతుందనే అభిప్రాయాలను అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. గ్రూప్ 1 కింద పోస్టుల భర్తీకి గాను ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఆర్ధిక శాఖ అనుమతి తీసుకొన్న తర్వాత ఇంటర్వ్యూలు కూడా రద్దు చేయాలని కూడా నిర్ణయం తీసుకొన్నారు. గ్రూప్ 1 పోస్టుల తర్వాత గ్రూప్ -2 పరీక్షల నిర్వహణకు సంబంధించి కూడా నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.పోలీస్ శాఖలో ఉద్యోగాల భర్తీకి గాను పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు నోటిఫికేషన్ జారీ చేయనుంది.
