Group-4 Exam | జులై 1న (నేడే) TSPSC గ్రూప్-4 పరీక్ష నిర్వహించనున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది.
Group-4 Exam | రాష్ట్రవ్యాప్తంగా నేడు(జులై 1) గ్రూప్-4 పరీక్ష జరగనుంది. ఇందుకోసం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్( TSPSC) విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టింది. ఈ పరీక్ష నిర్వహణకు రాష్ట్రవ్యాప్తంగా 2,878 కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ పరీక్ష రెండు సెషన్లలో జరుగనున్నది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పేపర్-1, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పేపర్-2 పరీక్ష జరుగుతుంది. అభ్యర్థులంతా పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని, పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు గేట్లు మూసివేయనున్నట్టు TSPSC సూచించింది.
అంటే ఉదయం జరిగే పేపర్-1కు 8.30 గంటల నుంచి 9.45 గంటల వరకు.. పేపర్-2కు మధ్యాహ్నం 1.00 గంటల నుంచి 2.15 గంటల వరకు మాత్రమే అనుమతించనున్నారు. సమయం దాటితే .. ఎట్టిపరిస్థితుల్లోనూ పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. పేపర్ 1 జనరల్ స్టడీస్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, పేపర్ 2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) పరీక్ష మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
పేపర్ లీకేజీ లాంటి అవాంఛనీయ ఘటన జరుగుకుండా ఈసారి కీలక చర్యలు చేపట్టనుంది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులను ఆరు రకాల పద్ధతుల్లో చెక్ చేయాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. ఈ క్రమంలో గతంలో బయోమెట్రిక్ ఉండగా, ఈసారి థంబ్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఫలితంగా ప్రతీ పరీక్షాకేంద్రంలో థంబ్ యంత్రాలను ఏర్పాటు చేశారు. వేలిముద్రలు ఇవ్వాలి కాబట్టే.. అభ్యర్థులు పరీక్షాకేంద్రానికి రెండు గంటల ముందే చేరుకోవాలని సూచించింది. నిమిషంలో వచ్చిన అభ్యర్థులకు పరీక్ష ముగిసిన అనంతరం వారి థంబ్ స్వీకరిస్తామని పేర్కొంది.
ఈ నేపథ్యంలో పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) అభ్యర్థులకు కీలక సూచనలు చేసింది . వాటిని చూస్తే......
>> గ్రూప్ 4 పరీక్ష ప్రారంభం కావడానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తారు. అందువల్ల నిర్ణీత సమయానికి ముందే అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాల్సి ఉంటుంది.
>> పరీక్ష కేంద్రంలో ప్రవేశించే ముందు అభ్యర్థులు .. భద్రతా సిబ్బందికి హాల్ టికెట్ తో పాటు ఫొటో గుర్తింపుకార్డు చూపించాలి. క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే పరీక్ష కేంద్రంలోకి అనుమతిస్తారు.
>> ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, రిమోట్‌తో కూడిన కారు తాళాలు, విలువైన, నిషేధిత వస్తువులను ఎగ్జామ్ హాల్ లోకి తీసుకెళ్లడానికి అనుమతించారు.
>> పరీక్షకు హాజరై అభ్యర్థులు చెప్పులు మాత్రమే ధరించాలి. షూ వేసుకుంటే.. లోనికి అనుమతించరు.
>> పరీక్షకు అభ్యర్థికాకుండా వేరే వ్యక్తులు హాజరైనట్లు గుర్తిస్తే.. అలాంటి వారిపై పోలీసు కేసు నమోదు చేయడంతో పాటు ఆ అభ్యర్థిని పరీక్షలకు అనర్హుడిగా ప్రకటిస్తారు.
>> ఈసారి థంబ్ తప్పనిసరి చేశారు. ప్రతి సెషన్ పరీక్ష ముగిశాక ఓఎంఆర్ షీట్‌ను ఇన్విజిలేటర్‌కు అందజేసి, నామినల్ రోల్‌లో సంతకం చేసి వేలిముద్ర వేయాలి.
>> పేపర్-1 (జనరల్ స్టడీస్) ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 (సెక్రటేరియల్ ఎబిలిటీస్) మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది.
>> పరీక్ష సమయానికి రెండు గంటల ముందు నుంచే హాల్ లోకి అనుమతిస్తారు..
>> అభ్యర్థులు ఎట్టి పరిస్థితిలోనూ ప్రశ్నపత్రంపై సమాధానాలను మార్క్ చేయకూడదు.
>> గ్రూప్-4 OMR షీట్ లో హాల్‌టికెట్, ప్రశ్నపత్రం నంబరు, పరీక్ష కేంద్రం కోడ్ వేసి.. పేరు రాసి సంతకం చేయాల్సి ఉంటుంది.
>> బ్లూ/ బ్లాక్ బాల్‌పాయింట్ పెన్‌కాకుండా ఇంక్‌పెన్, జెల్‌పెన్, పెన్సిల్ ఉపయోగిస్తే.. అలా ఓఎంఆర్ షీట్ లను చెల్లుబాటు కానివిగా ప్రకటిస్తారు.
