Janardhan Reddy: TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా
టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించారు. ఆయన 2021 మే నెలలో ఆయన TSPSC చైర్మన్‌గా నియమితులయ్యారు.
హైదరాబాద్: తెలంగాణలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కీలక పదవుల్లో ఉన్న పలువురు స్వయంగా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. తాజాగా, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) చైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు సమర్పించారు.
జనార్దన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. బోర్డుకు సంబంధించిన, ఉద్యోగాల భర్తీకి సంబంధించిన విషయాలపై చర్చించారు. ఉద్యోగాల భర్తీకి సంబంధించి మొత్తం వివరాలతో సమీక్ష నిర్వహించాలనీ అనుకున్నారు. కానీ, ఇంతలోనే టీఎస్‌పీఎస్‌పీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ జనార్దన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఆయన 2021మే నెలలో ఈ పదవిని చేపట్టారు.
Also Read: TSPSC: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
టీఎస్‌పీఎస్‌పీలో పేపర్ లీక్‌లు, నోటిఫికేషన్ వచ్చాక పరీక్షలు వాయిదా పడటం వంటి అనేక ఘటనలు జరిగిన సంగతి తెలిసిందే. వీటితో పోటీ పరీక్షలకు సిద్ధమైన నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తికి లోనైంది. గత ప్రభుత్వం పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంలో నిరుద్యోగుల అసంతృప్తి కూడా ప్రధాన పాత్ర పోషించింది. అయితే, ఈ అంశాన్ని కాంగ్రెస్ టేకప్ చేసింది. తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటించింది.
ఈ నేపథ్యంలో జనార్దర్ నెడ్డి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది.