Asianet News TeluguAsianet News Telugu

గ్రూప్-1 నోటిఫికేషన్: రద్దు చేసిన టీఎస్‌పీఎస్‌సీ


 గ్రూప్-1 నోటిఫికేషన్ ను టీఎస్‌పీఎస్‌సీ  రద్దు చేసింది.  2022లో  గ్రూప్-1 పోస్టుల భర్తీకి  నోటిఫికేషన్ జారీ చేసింది.

 TSPSC Cancels Group-1 Notification lns
Author
First Published Feb 19, 2024, 4:43 PM IST | Last Updated Feb 19, 2024, 5:14 PM IST


హైదరాబాద్: గ్రూప్-1 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్‌సీ ) రద్దు చేసింది.2022 ఏప్రిల్ లో 503 పోస్టులను  గ్రూప్-1 పరిధిలో భర్తీ చేయాలని  నోటిఫికేషన్ ను జారీ చేశారు.ఈ నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రద్దు చేసింది. గ్రూప్-1 నోటిఫికేషన్ ను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం నాడు రద్దు చేసింది. ఈ నెల 6వ తేదీన  గ్రూప్-1లో మరో 60 పోస్టులను చేర్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2022 ఏప్రిల్ మాసంలో  రాష్ట్రంలో  503 పోస్టులను భర్తీ చేయాలని  తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. 

also read:ఆంధ్రప్రదేశ్‌లో రేవంత్ ప్రచారం: తిరుపతి సభకు తెలంగాణ సీఎం

ఈ నోటిఫికేషన్ ప్రకారంగా  2023 అక్టోబర్  16న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. అయితే పేపర్ లీకేజీ కారణంగా  ఈ పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.  మరో వైపు మరోసారి ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించారు. అయితే  ఈ పరీక్ష విషయంలో కొందరు అభ్యర్థులు  హైకోర్టును ఆశ్రయించారు.  పరీక్ష నిర్వహణకు సంబంధించి నిబంధనలు పాటించలేదని  అభ్యర్థులు  కోర్టును ఆశ్రయించారు.ఈ విషయమై ఇరు వర్గాల  వాదనలు విన్న తర్వాత రెండో దఫా నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను రద్దు చేయాలని  హైకోర్టు ఆదేశించింది. 

also read:ఢిల్లీకి రేవంత్ రెడ్డి: కేబినెట్ విస్తరణ, నామినేటేడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చలు

హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో  టీఎస్‌పీఎస్‌సీ  సవాల్ చేసింది. అయితే అదే సమయంలో తెలంగాణ రాష్ట్రంలో  ఎన్నికలు జరిగాయి.  ఈ ఎన్నికల్లో ప్రభుత్వం మారింది. భారత రాష్ట్ర సమితి స్థానంలో  కాంగ్రెస్ అధికారాన్ని చేపట్టింది. అయితే  సుప్రీంకోర్టులో పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. దీంతో  సుప్రీంకోర్టులో పిటిషన్ ను  టీఎస్‌పీఎస్‌సీ వెనక్కు తీసుకుంది.   దరిమిలా ఈ నోటిఫికేషన్ ను రద్దు చేసింది.  తాజాగా  ప్రభుత్వం ప్రకటించిన 60 పోస్టులతో కలిపి  563 పోస్టులతో గ్రూప్-1 పోస్టుల భర్తీకి  టీఎస్‌పీఎస్‌సీ  ప్రెష్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. 

గతంలో  టీఎస్‌పీఎస్‌సీ నిర్వహించిన పరీక్షల పేపర్లు లీకయ్యాయి.దీంతో  యూపీఎస్‌సీ తరహాలో టీఎస్‌పీఎస్‌సీని ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.ఈ మేరకు అధికారుల కమిటీ అధ్యయనం చేసింది. ఈ కమిటీ  ప్రభుత్వానికి నివేదికను కూడ సమర్పించింది. యూపీఎస్‌సీ చైర్మెన్ తో  రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడ  భేటీ అయ్యారు. టీఎస్‌పీఎస్‌సీ చైర్మెన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమించారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios