తండ్రి కేసీఆర్ నాయకత్వ లక్షణాలను పునికిపుచ్చుకున్న కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు చేపట్టడం మంచి పరిణామమని టీఎస్ఎండీసీ ఛైర్మన్ శేరిసుభాష్ రెడ్డి అభిప్రాయపడ్డారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన మంత్రి కేటీఆర్‌‌‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కేటీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి తామంతా సిద్దంగా ఉన్నామని సుభాష్ రెడ్డి అన్నారు. 

టీఆర్ఎస్ పార్టీని సమర్థవంతంగా నడిపించే నాయకులు కేటీఆర్ చేతిలో పెట్టిన సీఎం కేసీఆర్ కు తెలిపిన సుభాష్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సమర్థత, కార్యదక్షత, రాజకీయ వ్యూహాల్లో ఆరితేరిన నాయకుడే కాంకుండా మంచి వాక్చాతుర్యం వున్న యువ నాయకుడు కేటీఆర్ అంటూ ప్రశంసించారు. ఆయన నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ ముందు ముందు మరిన్ని విజయాలు సాధించనుందని సుభాష్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. 

మంత్రి కేటీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి గడిచిన నాలుగున్నరేండ్లలోనే జరిగిన అన్ని ఎన్నికలల్లో  టీఆర్ఎస్ పార్టీని విజయపథంలో నడిపించారని కొనియాడారు. అందువల్ల ఆయన నాయకత్వంలో ప్రతి టీఆర్ఎస్ కార్యకర్త క్రమశిక్షణ కలిగిన గులాబీ సైనికుడిలా ప్రజా క్షేత్రంలో పని చేయాలని సూచించారు.రాబోయు కాలంలో టీఆర్ఎస్ పార్టీ అజేయశక్తిగా మారుతుందని శేరి సుభాష్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.