తెలంగాణ టెట్ ఫలితాలు విడుదలపేపర్ 2లో 19.51 శాతం ఉత్తీర్ణతపేపర్ 1లో 57.37 ఉత్తీర్ణత

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైదరాబాద్ : టీఎస్ టెట్ -2017 ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ శుక్రవారం సాయంత్రం విడుదల చేశారు. పేపర్ 1లో 57.37 శాతం ఉత్తీర్ణత సాధించారు. పేపర్ 2లో 19.51 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల కోసం tstet.cgg.gov.in వెబ్‌సైట్‌ను లాగిన్ కావొచ్చు. జులై 23న టెట్ ఎగ్జామ్ నిర్వహించిన విషయం విదితమే. పేపర్-1 పరీక్షకు 88.59 శాతం మంది, పేపర్-2 పరీక్షకు 90.09 శాతం మంది అభ్యర్థులు హాజరయ్యారు. 1,11,647 మంది పేపర్-1 పరీక్ష రాయాల్సి ఉండగా ఇందులో 12,742 మంది గైర్హాజరయ్యారు. పేపర్-2 కోసం 2,56,265 మంది రాయాల్సి ఉండగా 25,384 మంది హాజరుకాలేదు.