Asianet News TeluguAsianet News Telugu

మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్ ఆర్టీసీ.. కార్గో సేవ‌ల ద్వారా రాఖీల‌ను పంపే ఛాన్స్..

టీఎస్ ఆర్టీసీ కార్గో సేవల ద్వారా తమ సోదరులకు రాఖీలను పంపించుకునే అవకాశం కల్పిస్తున్నట్టు ఆ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ పరిధిలో హోం డెలివరీ సదుపాయం కూడా ఉందని పేర్కొంది. 

TS RTC gave good news to women.. Chance to send rakhis through cargo services..
Author
Hyderabad, First Published Jul 28, 2022, 1:28 PM IST

ఇప్ప‌టికే ప‌లు రాకల సేవ‌ల‌తో, ఆఫ‌ర్ల‌తో తెలంగాణ ప్ర‌యాణికుల‌ మ‌న‌సు దోచుకుంటున్న టీఎస్ ఆర్టీసీ తాజాగా మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. వ‌చ్చే రాఖీ పౌర్ణ‌మి సంద‌ర్భంగా ప‌లు కారణాల‌తో త‌మ సోద‌రుల‌కు రాఖీ క‌ట్ట‌లేక‌పోతున్న మ‌హిళ కోసం ఒక స‌దుపాయాన్ని తీసుకొచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా ఎక్క‌డా ఉన్న త‌మ ఆత్మీయుల‌కు రాఖీలు పంపించుకునేందుకు  టీఎస్ ఆర్టీసీ కార్గో సేవ‌లు ఉప‌యోగించుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించింది. 

మూసీకి తగ్గిన వరద: మూసారాంబాగ్ బ్రిడ్జిపై పేరుకున్న బురద తొలగింపు

రాఖీ సంద‌ర్భంగా త‌మ సోద‌రుల‌ను క‌ల‌వ‌లేక‌పోతున్న వారికి ఇది సంతోష‌క‌ర‌మైన వార్త‌గానే చెప్ప‌వ‌చ్చు. అలాంటి వారి కోసమే కార్గో, పార్సిల్ సేవ‌ల ద్వారా త‌క్కువ ఖ‌ర్చులో రాఖీల‌ను త‌మ అన్న‌ద‌మ్ముల‌కు రాఖీలు పంపించే అవ‌కాశం క‌ల్పించామ‌ని సంస్థ తెలిపింది. అయితే వీటిని రాష్ట్ర రాజ‌ధాని, మ‌రో న‌గ‌రం సికింద్రాబాద్ లో హోమ్ డెలివ‌రీ కూడా చేసేందుకు  సిద్ధ‌మ‌య్యింది. ఇది గ్రామీణ, వివిధ ప‌ట్ట‌ణాల్లో నివ‌సిస్తూ హైద‌రాబాద్ కు రాలేని వారికి ఎంతో ఉప‌యోగ‌క‌రంగా మార‌నుంది. ఈ కార్గో, పార్శిల్ సేవ‌ల గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకునేందుకు 9154298858, 9154298829 అనే నెంబ‌ర్ల‌కు కాల్ చేయాల‌ని టీఎస్ ఆర్టీసీ ప్ర‌క‌టించింది. 

విచారణకు రావాలి: చీకోటి ప్రవీణ్ కు ఈడీ నోటీసులు

తెలంగాణ ఆర్టీసీ ఎండీగా స‌జ్జ‌నార్ బాధ్య‌తలు స్వీక‌రించిన నాటి నుంచి సంస్థ‌ను లాభాల బాట‌లో న‌డిపేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. నష్టాలతో కూరుకుపోతున్న సంస్థను లాభాల బాట పట్టించడానికి అనేక ప్రయోగాలు చేస్తున్నారు. అటు ఆర్టీసీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు లాభాల వైపు పరుగులు తీసేలా సజ్జనార్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే రాఖీల‌ను కార్గో ద్వారా కొరియ‌ర్ చేయాల‌ని నిర్ణ‌యించారు. కాగా కొంత మే నెల‌లో కూడా ఆయ‌న ఇలాంటి నిర్ణ‌య‌మే తీసుకున్నారు. రైతుల నుంచి నేరుగా మామిడి ప‌ల్ల‌ను సేక‌రించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల‌కు స‌ర‌ఫ‌రా చేశారు. హోం డెలివ‌రీ స‌దుపాయం కూడా క‌ల్పించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios