తెలంగాణ ఆర్టీసీకి సంక్రాంతి సందర్భంగా రూ. 107 కోట్ల ఆదాయం లబించింది. పండుగను పురస్కరించుకొని 55 లక్షల మంది ప్రయాణీకులను ఆర్టీసీ గమ్యస్థానాలకు చేర్చింది.

హైదరాబాద్ నష్టాల్లో ఉన్న Telangana ఆర్టీసీకి సంక్రాంతి సందర్భంగా భారీ ఎత్తున ఆదాయం వచ్చింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఆర్టీసీ నాలుగు వేల ప్రత్యేక బస్సులను నడిపింది. పండుగకు ఉద్యోగులను తమ స్వగ్రామాలకు చేర్చింది. అంతేకాదు పండుగ పూర్తైన తర్వాత స్వగ్రామాలకు ప్రయాణీకులను చేర్చేందుకు గాను 3500 బస్సులను నడిపింది.

తెలంగాణ RTC సంస్థ 55 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చింది. సంక్రాంతికి నడిపిన ప్రత్యేక బస్సులతో ఆర్టీసీకి రూ. 107 కోట్ల ఆదాయం వచ్చినట్టుగా అధికారులు తెలిపారు.Sankranti పండుగకు స్వంత గ్రామాల నుండి హైద్రాబాద్ కు తిరిగి వచ్చే వారి కోసం 3500 స్పెషల్ Bus నడిపినట్టుగా గా తెలంగాణ ఆర్టీసీ ఎండీ వీసీ Sajjanar ప్రకటించారు.

Hyderabad నగరంలో నివసిస్తున్నవారిలో మెజారిటీ ప్రజలు Andhra pradesh రాష్ట్రంలోని తమ స్వంత గ్రామాలకు వెళ్లారు. ఇవాళ్టితో సెలవులు పూర్తయ్యాయి. ఏపీలోని స్వంత గ్రామాల నుండి హైద్రాబాద్ కు రావడానికి 3500 ప్రత్యేక Bus అందుబాటులో ఉంచామని సజ్జనార్ ప్రకటించారు. మరోవైపు 110 ప్రత్యేక trains దక్షిణ మధ్య రైల్వే నడుపుతుంది.

హైద్రాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంక్రాంతి పర్వదినానికి వెళ్లే వారి కోసం 4 వేల ప్రత్యేక బస్సులను నడిపింది తెలంగాణ ఆర్టీసీ. ఈ నెల 14వ తేదీ వరకు 4 వేల బస్సులను వేర్వేరు ప్రాంతాల నుండి నడిపారు. తెలంగాణలోని 3,338 బస్సులు, ఏపీకి 984 బస్సులు నడిపారు. 

హైద్రాబాద్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, మెదక్, సిద్దిపేట లనుండి ప్రత్యేక బస్సులను నడిపారు. విశాఖపట్టణం, శ్రీకాకుళం, భీమవరం, తెనాలి, గుంటూరు, కాకినాడలకు ప్రత్యేక బస్సులు నడిపారు. ఆంధ్రప్రదేశ్ కు హైద్రాబాద్ నగరంలోని పలు చోట్ల నుండి ప్రత్యేక బస్సులను నడిపారు. హైద్రాబాద్ లోని ఎంజీబీఎస్, జేబీఎస్, మీయాపూర్, అమీర్ పేట, టెలిఫోన్ భవన్, జీడిమెట్ల, ఉప్పల్ క్రాష్ రోడ్స్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల నుండి ఈ బస్సులను నడిపారు.

సంక్రాంతిని పురస్కరించుకొని ఏపీఎస్ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులను నడిపింది. ఈ నెల 7 నుండి 18వ తేదీ వరకు ప్రత్యేక బస్సులు నడవనున్నాయి.6970 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని ఏపీఎస్ఆర్టీసీ ప్రకటించింది.ప్రత్యేక బస్సులు 50 శాతం అదనంగా చార్జీలు వసూలు చేయనున్నాయని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
హైద్రాబాద్, చెన్నై, బెంగుళూరుల నుండి కూడా ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపింది.

సంక్రాంతిని ఆ:ద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పెద్ద ఎత్తున జరుపుకొంటారు. మూడు రోజుల పాటు కోడి పందెలు, సంప్రదాయ పోటీలతో పాటు అక్కడక్కడ జల్లికట్టు పోటీలు జరుగుతాయి. ఈ దఫా కరోనా కారణంగా ఇతర రాష్ట్రాల నుండి స్వగ్రామాలకు వచ్చే వారి సంఖ్య కొంచెం తక్కువగా ఉందనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. తెలంగాణ నుండి పెద్ద ఎత్తున ఏపీ రాష్ట్రంలోని తమ స్వగ్రామాలకు ప్రజలు పండుగకు వెళ్లారు. ఈ పండుగన ఆర్టీసీ క్యాష్ చేసుకొంది. ప్రత్యేక బస్సులను నడిపింది. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేర్చడం ద్వారా రూ. 107 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.