రైతులకు ఉచిత విద్యుత్ అందించే విషయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో రేవంత్ రెడ్డిపై మంత్రి మల్లారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రైతులకు ఉచిత విద్యుత్ ఇచ్చే విషయంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రేవంత్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. రైతుల సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా అధికార బీఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు, పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాక ముందే తన నిజస్వరూపాన్ని బయటపెడ్డుకుందని మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు చేస్తూ రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలను దహనం చేస్తున్నారు.
ఈ నిరసన కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈ సమయంలో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నోటి ఎంత వస్తే.. అంతగా తిట్టిపాడేశాడు. రేవంత్ రెడ్డి తనను కూడా బ్లాక్ మెయిల్ చేశారని, ఆయనకు పుట్టగతులుండవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ నాశనం అయిపోతుందంటూ ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని దొంగ అంటూ.. అసలూ ఆ దొంగకు పీసీసీ పదవి ఎందుకు ఇచ్చారంటూ విమర్శించారు.రైతుల జోలికొస్తే రేవంత్ కు పుట్టగతులుండవని హెచ్చరించారు.
రేవంత్ ఓ బ్లాక్ మెయిలర్ అని.. దగాకోరు అని విమర్శించారు.డబ్బుల కోసం బిక్షమెత్తుకోవడానికి రేవంత్.. అమెరికా వెళ్లాడని మంత్రి మల్లారెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకపడ్డారు. కాంగ్రెస్ పార్టీ దివాలా తీసిందని, ఆ దివాలా తీసిన పార్టీకి చీఫ్ రేవంత్ అని మండిపడ్డారు. పీసీసీ చీఫ్ పదవికే ఆయన సీఎం పదవి అని ఫీలవుతున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డిని నమ్మొద్దని చెప్పారు. కాంగ్రెస్ రైతులను మోసం చేస్తుందన్నారు. కేసీఆర్ రైతుల మేము కోరేవారని.. బీఆర్ఎస్ ది రైతు సర్కార్ అని పేర్కొన్నారు మంత్రి మల్లారెడ్డి.
