Asianet News TeluguAsianet News Telugu

విడుదలైన తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలు: రిజల్ట్స్ తెలుసుకోండిలా

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. 

TS inter Results 2020 manabadi inter result check here
Author
Hyderabad, First Published Jun 18, 2020, 2:59 PM IST

తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు. తొలిసారిగా ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండియర్ ఫలితాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాల్లో 2,88,383 మంది విద్యార్దులు ఉత్తీర్ణత సాధించినట్లుగా మంత్రి వెల్లడించారు.

మొత్తం 60.11 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని.. తొలి సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి అని వివరించారు. 67.77 శాతం మంది బాలికలు ఉత్తీర్ణత సాధించారని.. బాలురు 52.30 శాతం మంది పాసయ్యారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

రెండో సంవత్సరం ఫలితాల్లో 2,83,462 మంది ఉత్తీర్ణత సాధించారని.. మొత్తం 68.86 శాతం మంది విద్యార్ధులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి వెల్లడించారు. రెండో సంవత్సర ఫలితాల్లో బాలికలదే పైచేయి సాధించారని చెప్పారు.

75.15 శాతం బాలికలు ఉత్తీర్ణత సాధించారని, బాలుర ఉత్తీర్ణత శాతం 62.12 శాతం నమోదైందని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్‌లో 75 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా అగ్రస్థానంలో నిలవగా.. సెకండియర్‌లో 76 శాతం ఉత్తీర్ణతతో కొమురం భీమ్ జిల్లా తొలి స్థానంలో నిలిచిందని మంత్రి చెప్పారు.

సప్లిమెంటరీ పరీక్షల వివరాలను త్వరలో వెల్లడిస్తామని.. ఫెయిల్ అయిన విద్యార్ధులు మానసిక స్థైర్యంతో ఉండాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు. 

విద్యార్ధులను తమ ఫలితాలను ఈ కింద ఇచ్చిన వెబ్‌సైట్స్ ద్వారా తెలుసుకోవచ్చు.


http://Tsbie.cgg.gov.in
http://Manabadi.com
http://Examresults.ts.nic.in
http://Results.ccg.gov.in
https://www.sakshieducation.com/
schools9.com 


దీనితో పాటు  గూగుల్ ప్లే స్టోర్‌లో TSBIE m-Services అనే యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. కాగా ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9.65 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకోగా 95.72 శాతం మంది హాజరయ్యారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు అధికారులు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగిన విషయం తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios