Asianet News TeluguAsianet News Telugu

జగన్ అక్రమాస్తుల కేసు: హెటిరో డైరెక్టర్‌కు హైకోర్టులో షాక్

ఏపీ సీఎం, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌ (Jagan Mohan Reddy illegal assets case) అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టులో (telangana high court) చుక్కెదురైంది. ఆయనతో పాటు హెటిరో గ్రూప్‌ను (hetero group) జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది

ts high court verdict on hetero group in ys jagan illeagal assets case
Author
Hyderabad, First Published Nov 30, 2021, 7:42 PM IST

ఏపీ సీఎం, వైసీపీ (ysrcp) అధినేత వైఎస్ జగన్‌ (Jagan Mohan Reddy illegal assets case) అక్రమాస్తుల కేసులో హెటిరో డైరెక్టర్‌ ఎం.శ్రీనివాస్‌రెడ్డికి హైకోర్టులో (telangana high court) చుక్కెదురైంది. ఆయనతో పాటు హెటిరో గ్రూప్‌ను (hetero group) జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తొలగించేందుకు న్యాయస్థానం నిరాకరించింది. అరబిందో, హెటిరో సంస్థలకు జడ్చర్ల సెజ్‌లో భూ కేటాయింపుపై దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌లో శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో సంస్థను నిందితుల జాబితాలో సీబీఐ చేర్చింది. ఈ నేపథ్యంలో తమను కేసు నుంచి తొలగించాలని కోరుతూ శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్లు చాలా కాలంగా న్యాయస్థానం వద్దే పెండింగ్‌లో ఉన్నాయి. 

జగన్‌ కేసులకు సంబంధించిన పిటిషన్లపై రోజువారీ విచారణ ప్రారంభించిన హైకోర్టు..  మొదట శ్రీనివాస్‌రెడ్డి, హెటిరో క్వాష్‌ పిటిషన్లపై వాదనలు విని మంగళవారం తీర్పు వెలువరించింది. సీబీఐ అభియోగాల్లో నిజం లేదని, జగన్‌ సంస్థల్లో పెట్టుబడులు వ్యాపార వ్యూహాల్లో భాగమేనని, భూ కేటాయింపుల్లో అక్రమాలేవీ జరగలేదని హెటిరో తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జగన్‌ ప్రమేయంతో అప్పటి వైఎస్‌ సర్కారు హెటిరో సంస్థకు తక్కువ ధరకు భూమిని కేటాయించిందని సీబీఐ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం క్వాష్‌ పిటిషన్లను కొట్టి వేసింది. 

ALso Read:జగతి పబ్లికేషన్‌ లోవి పెట్టుబడులు కావు.. అన్నీ ముడుపులే.. సీబీఐ

కాగా.. నవంబర్ 9న జరిగిన విచారణ సందర్భంగా.. సీబీఐ తరఫు న్యాయవాది సురేందర్ వాదనలు వినిపించారు. ‘జగతి సంస్థలో  జగన్ రూపాయి కూడా Investment పెట్టకుండానే ఇతరులతో రూ.1246 కోట్లు పెట్టుబడిగా పెట్టించారు. ఇందుకోసం తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నారు.  ఈ విషయంలో జగన్, విజయసాయిరెడ్డి ప్రణాళిక ప్రకారం కుట్రపూరితంగా వ్యవహరించారు. తండ్రి అధికారాన్ని ద్వారానే హెటిరో, తదితర కంపెనీలకు లబ్ధి చేకూర్చి, వారిచ్చే ముడుపులనే.. జగన్ తన సంస్థల్లోకి పెట్టుబడులు మళ్ళించారు’ అని తెలిపారు.  ఈ విషయాన్ని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ  స్వయంగా ధ్రువీకరించిందని, హెటిరో హెల్త్ కేర్ లో జరిపిన తనిఖీల్లో ఈ పెట్టుబడులకు సంబంధించిన వివరాలు బయటపడ్డాయని వెల్లడించారు.

జగన్ సంస్థల్లో హెటిరో   2006, 2007లో  రెండు దఫాలుగా పెట్టుబడి పెట్టిందని..  అదే సమయంలో  ఆ సంస్థకు  వైఎస్ ప్రభుత్వం  50 ఎకరాలు  కేటాయించిందని తెలిపారు.  2008లో  మరోసారి పెట్టుబడి పెట్టకే.. Land allotment 75 ఎకరాలకు చేరిందని  తెలిపారు.  ఈ వ్యవహారంలో హెటిరో  ఎండి శ్రీనివాస్ రెడ్డి కీలక పాత్ర పోషించారు కాబట్టే.. ఆయన నిందితుడిగా చేర్చామని స్పష్టం చేశారు. హెటిరో  డైరెక్టర్లు అందరూ నిందితులని తాము చెప్పడం లేదని పేర్కొన్నారు. నిబంధనల మేరకే Chargesheetను సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించిందని..  తప్పు జరిగినట్లు అన్ని రుజువులు ఉన్నందున పిటిషన్లను తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు.  సిబిఐ వాదనలకు తాము సమాధానం చెబుతామని హెటిరో  సీనియర్ న్యాయవాది టి. నిరంజన్ రెడ్డి హైకోర్టుకు తెలిపారు.  దీంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Follow Us:
Download App:
  • android
  • ios