Asianet News TeluguAsianet News Telugu

మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్: బీరుపై రూ. 10 తగ్గింపు

బీరు ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  బీరుపై  పది రూపాయాలను తగ్గిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించింది.
 

TS government reduces beer rates lns
Author
Hyderabad, First Published Jul 5, 2021, 8:23 PM IST

హైదరాబాద్: బీరు ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.  బీరుపై  పది రూపాయాలను తగ్గిస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ప్రకటించింది.గతంలో ప్రత్యేక ఎక్సైజ్ సెస్ పేరుతో ఒక్కో బీరు సీసాపై విధించిన రూ. 30 పన్నును తెలంగాణ ప్రభుత్వం విధించింది. ఈ పన్నులో రూ. 10 తగ్గించింది. తగ్గించిన ధరలు ఇవాళ్టి నుండి అమల్లోకి వస్తాయని  తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.

మద్యం దుకాణాల్లోని పాత స్టాక్ కు కాకుండా డిస్టిల్లరీల్లో ఉత్పత్తి చేసే కొత్త స్టాక్ కు ఈ ధరలను వర్తింపజేయాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది.2020 మార్చి నుండి బీరు సేల్స్ గణనీయంగా పడిపోయాయి.  కరోనా కారణంగా తెలంగాణలో బీరు అమ్మకాలు సగానికి పడిపోయాయి. చల్లని వస్తువులు తినడం తాగడం వల్ల కరోనా వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కారణంగా బీరు విక్రయాలు పడిపోయాయి.తెలంగాణ ప్రభుత్వానికి మద్యం విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున ఆదాయం పొందుతోంది.  అయితే కరోనా కారణంగా రాష్ట్రంలో బీరు విక్రయాలు పడిపోయాయి.

Follow Us:
Download App:
  • android
  • ios