Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణఈఏపీసెట్ షెడ్యూల్ విడుదల:మే 9 నుండి 12 వరకు పరీక్షలు


తెలంగాణలో  ఇంజనీరింగ్, అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను ఉన్నత విద్యా మండలి విడుదల చేసింది. 

TS EAPCET 2024 registration to begin from February 26; schedule lns
Author
First Published Feb 6, 2024, 5:18 PM IST | Last Updated Feb 6, 2024, 5:32 PM IST

 హైదరాబాద్: ఈఏపీ సెట్ షెడ్యూల్  మంగళవారంనాడు  రాష్ట్ర ప్రభుత్వం  విడుదల చేసింది.ఈ నెల  21న ఈఏపీ సెట్ నోటిఫికేషన్  విడుదల కానుంది. ఈనెల 26 నుండి ఏప్రిల్ 6 వరకు ఈఏపీ సెట్ ధరఖాస్తులు స్వీకరించనున్నారు.  మే 9వ తేదీ నుండి  12వ తేదీ వరకు  తెలంగాణ రాష్ట్ర ఇంజనీరింగ్ , అగ్రికల్చర్ ఫార్మసీ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్షలు నిర్వహించనున్నారు.

also read:నన్ను టచ్ చేయడం రేవంత్ వల్ల కాదు: బీఆర్ఎస్ నేతల సమావేశంలో కేసీఆర్

ఆన్‌లైన్ లో ధరఖాస్తు చేసుకోవాలని  సెట్ కన్వీనర్ డీఎన్ కుమార్ చెప్పారు.జెఎన్‌టీయూ ఈ పరీక్షలను నిర్వహించనుంది. ఇవాళ నిర్వహించిన సమావేశంలో సెట్ కమిటీ ఈ షెడ్యూల్ ను ఆమోదించిందని  డీఎన్ కుమార్ తెలిపారు.తెలంగాణ ప్రభుత్వం ఇటీవలనే  ఎంసెట్ పేరును టీఎస్‌ఏపీసెట్ మార్చిన విషయం తెలిసిందే.
మే 6న ఈసెట్, మే 9 నుండి  13వ తేదీ వరకు  ఎంసెట్, మే 23న ఎడ్ సెట్, జూన్  3న లాసెట్, జూన్ 4,5 తేదీల్లో  ఐసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టుగా తెలంగాణ ఉన్నత విద్యా మండలి  ప్రకటించిన విషయం తెలిసిందే.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios