తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ షెడ్యూల్ ను మంగళవారం నాడు విడుదల చేసింది. ఈ ఏడాది జూలై మాసంలో ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది.

హైదరాబాద్: Eamcetషెడ్యూల్ ను మంగళవారం నాడు విడుదల చేసింది Telangana ప్రభుత్వం. ఈ ఏడాది జూలై 14 నుండి 20వ తేదీ వరకు ఎంసెట్ నిర్వహించనున్నట్టుగా తెలంగాణ సర్కార్ ప్రకటించింది.రాష్ట్రంలోని 28 రీజినల్ సెంటర్స్ పరిధిలోని 105 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. 

జూలై 14,15, 18,19, 20 తేదీల్లో ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. . జూలై 14, 15 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ , జూలై 18,19, 20 తేదీల్లో ఇంజనీరింగ్ పరీక్షలను నిర్వహించనున్నట్టుగా తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.జూలై 13న ఈె సెట్ నిర్వహించనున్నట్టుగా మంత్రి తెలిపారు.

ఐఐటీ జేఇఇ ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ఇటీవలనే విడుదలైంది. దీంతో ఇంటర్, టెన్త్ పరీక్షల షెడ్యూల్ ను తెలంగాణ ప్రభుత్వం మార్పులు చేర్పులు చేసింది. ఎంసెట్ ప్రవేశ పరీక్షల కోసం ఈ నెల మొదటి వారంలో ఉన్నత విద్యా మండలి సమావేశమైంది. ఎంసెట్ నిర్వహణకు సంబంధించి చర్చించింది. ఈ నెల 14వ తేదీనే నోటిఫికేషన్ జారీ చేయాలని భావించారు. కానీ విడుదల చేయలేదు. ఐఐటీ జేఇఇ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాది మే మాసంలో ఇంటర్ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఇంటర్ పరీక్షలు పూర్తైన తర్వాత ఎంసెట్ పరీక్షలను నిర్వహించనున్నారు. 

 ఎంసెట్‌ పరీక్ష పూర్తయిన నెల రోజుల్లోపు ఎంసెట్‌ ర్యాంకలు వెల్లడి చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. వాస్తవానికి గతంలో తెలంగాణ ఎంసెట్‌కు ఇంటర్‌ మార్కుల వెయిటేజ్‌ ఉండేది. కానీ, ఈ దఫా ఇంటర్ మార్కుల వెయిటేజీ ఎంసెట్ కు ఉండదని ప్రభుత్వం తేల్చి చెప్పింది.

ఇంటర్ ఫస్టియర్‌ పరీక్షల్లో కనీస మార్కులతో students ను ప్రమోట్‌ చేశారు. ఈ మేరకు ఇంటర్‌ ద్వితీయ సంవత్సరంలో ఎంసెట్‌ అర్హత మార్కులు 40 శాతం ఉండాలన్న నిబంధనను ఎత్తివేస్తూ సమావేశం నిర్ణయం తీసుకుంది.