హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల్లో పది ర్యాంకుల్లో అబ్బాయిలే సాధించారు. త్వరలోనే అగ్రికల్చర్, ఫార్మసీ ఫలితాలను విడుదల చేయనున్నారు. 

మంగళవారం నాడు  హైద్రాబాద్ జేఎన్‌టీయూలో తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఎంసెట్ ఫలితాలను విడుదల చేశారు.
తెలంగాణ ఎంసెట్  లో 75.29శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారని మంత్రి తెలిపారు.ఎంసెట్ లో 89,734 మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు.

ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షకు 1 లక్షా 19 వేల 183 మంది విద్యార్థులు హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకొంటూ అన్ని రకాల ప్రవేశ పరీక్షలు నిర్వహించినట్టుగా మంత్రి తెలిపారు.

కరోనా కారణంగా పరీక్షలు రాయని విద్యార్ధులకు మరోసారి ఎంసెట్ పరీక్షలను ఈ నెల 8వ తేదీన నిర్వహిస్తామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
ఎంసెట్ లో తొలి పది ర్యాంకులు అబ్బాయిలకు దక్కినట్టుగా మంత్రి తెలిపారు. 

ఫస్ట్ ర్యాంకు- వారణాసి సాయితేజ
రెండో ర్యాంకు- యశ్వంత్ సాయి
మూడో ర్యాంకు - వెంకటకృష్ణ
నాలుగో ర్యాంకు -కౌశల్ కుమార్ రెడ్డి
ఐదో ర్యాంకు - రాజ్‌పాల్
ఆరో ర్యాంక్ -నితిన్ సాయి
ఏడో ర్యాంక్ -ఈవీఎన్వీఎస్ కృష్ణ కమల్
ఎనిమిదో ర్యాంక్-అన్నం సాయివర్ధన్
తొమ్మిది ర్యాంక్ - సాయి పవన్ హర్షవర్ధన్
పదో ర్యాంక్-వారణాసి  వచిన్ సిద్దార్ధ్