TS Cop యాప్ హ్యాక్.. ఆన్‌లైన్‌లో అమ్మకానికి డేటా.. వారం రోజుల్లో రెండోసారి పోలీసులకు షాకిచ్చిన హ్యాకర్లు

తెలంగాణ పోలీసులకు హ్యాకర్లు మరో షాక్ ఇచ్చారు. ఇటీవల హాక్ ఐ యాప్ ను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు... తాజాగా TS COP యాప్ ను హ్యాక్ చేశారు. ఇందులో డేటాను ఆన్లైన్ మార్కెట్లో అమ్మకానికి ఉంచారు. ప్రజలకు సంబంధించిన సమగ్ర సమాచారం నిక్షిప్తమై ఉన్న యాప్ హ్యాక్ అవడం, ప్రజలకు సంబంధించిన డేటా అమ్మకానికి పెట్టడం ఆందోళన కలిగిస్తోంది.  

TS Cop app hacked .. Data for sale online .. Hackers shocked police for second time in a week GVR

తెలంగాణ పోలీసులకు సైబర్‌ నేరగాళ్లు చుక్కలు చూపిస్తున్నారు. వారం రోజుల వ్యవధిలో రెండు పోలీసు యాప్‌లపై సైబర్‌ దాడికి పాల్పడ్డారు. వారం కిందటే తెలంగాణ పోలీస్ హాక్ ఐ యాప్‌ను హ్యాక్‌ చేసిన సైబర్‌ కేటుగాళ్లు.. ఇప్పుడు టీఎస్‌ కాప్‌ యాప్‌ను హ్యాక్‌ చేశారు.  అందులో ఉన్న పోలీసు శాఖకు సంబంధించిన సమాచారాన్ని తస్కరించి... ఆన్‌లైన్‌ 120 డాలర్లకు అమ్మకానికి పెట్టారు. ఇది తెలుసుకొని అప్రమత్తమైన తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసు శాఖ.. కేటుగాళ్లను పట్టుకొనే పనిలో నిమగ్నమైంది. కాగా, ఇప్పటివరకు సామాన్యులను వలలో వేసుకొని లూటీ చేస్తున్న సైబర్‌ నేరగాళ్లు ఇప్పుడు ఏకంగా పోలీసు శాఖపైనే కన్నేయడం సర్వత్రా ఆందోళన రేకిస్తోంది.

టీఎస్‌ కాప్‌ యాప్‌ను 2016లో ప్రారంభించారు. 2017లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB) అవార్డును కూడా అందుకుంది. పోలీసు శాఖకు సంబంధించిన అంతర్గత సమాచారం ఇందులో ఉంటుంది. ఈ యాప్‌ ద్వారానే ప్రజలు వారి సమస్యలపై పోలీసులకు ఫిర్యాదులు చేస్తుంటారు. ఇందులోని సమాచారాన్ని తెలుసుకొని పోలీసులు సత్వర సేవలు అందిస్తుంటారు. ఈ యాప్‌లో తెలంగాణలోని పోలీస్ స్టేషన్ల వివరాలు, తుపాకీ లైసెన్స్‌దారుల సమాచారం, ప్రజల ఆధార్, ఫోన్ నంబర్లు, ఇతర వ్యక్తిగత సమాచారం కూడా నిక్షిప్తమై ఉంటుంది. 

గతంలో హాక్ ఐ యాప్‌ను హ్యాక్ చేసిన ముఠానే టీఎస్ కాప్‌ యాప్‌ను కూడా హ్యాక్‌ చేసినట్లు సైబర్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. తెలంగాణ కాప్స్‌ నెట్‌వర్క్‌తో పాటు టీఎస్‌కాప్‌, అందులో ఉండే ఫేషియల్‌ రికగ్నిషన్‌ సెటప్‌ మొత్తాన్ని గుర్తుతెలియని వ్యక్తలు హ్యాక్ చేశారని డేటా సెక్యూరిటీ రీసెర్చర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. టీఎస్‌ కాప్ యాప్‌లో ఎంబెడెడ్‌ పాస్వర్డ్‌లను ఐటీ సంస్థ ప్లెయిన్‌ టెక్స్ట్‌ రూపంలో పొందుపరిచడం వల్ల క్రైమ్ అండ్‌ క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ & సిస్టమ్స్ (CCTNS)కి కూడా కనెక్ట్ అయి ఉంటుందని వివరించారు. ఇలా ఉండటం వల్ల హ్యాకింగ్‌ చేయడానికి చాలా ఈజీ అవుతుందని తెలిపారు. ప్రజల సమాచారం నిక్షిప్తం చేసిన టీఎస్‌ కాప్‌ యాప్‌ హ్యాక్‌ కావడంపై పలువురు ఆందోళన వ్యక్తం చేస్తుండగా.. హ్యాకర్లను త్వరలోనే పట్టుకుంటామని సైబర్ విభాగంగా తెలిపింది...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios