హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 30 శాతం ఇంటర్ సిలబస్ ను ప్రభుత్వం తగ్గించింది. 2020-21 విద్యాసంవత్సరంలో 30 శాతం సిలబస్ ను ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ లో తగ్గించడానికి ప్రభుత్వం అంగీకరించింది.

హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీ సబ్జెక్టులలో 30 శాతం సిలబస్ తగ్గించారు. సైన్స్ సబ్జెక్టుల్లో సీబీఎస్ఈ నిర్ణయం మేరకు సిలబస్ ను తగ్గించనున్నట్టుగా ప్రభుత్వం ప్రకటించింది. 

తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కమిటిని ఏర్పాటు చేసింది. సీబీఎస్ఈ ఏయే సబ్జెక్టుల్లో సిలబస్ ను తగ్గించాలనే విషయమై కమిటీ సిఫారసులు చేయనుంది.హ్యుమానిటీష్, లాంగ్వేజ్ లలో 30 శాతం సిలబస్ లను తగ్గించాలని సిఫారసు చేసింది.

రివైజ్డ్ చేసిన హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్సెస్, జియోగ్రఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, కామర్స్, అకౌంటెన్సీ పుస్తకాలు విద్యార్థుల కోసం తెలుగు అకాడమీ సిద్దం చేసిందని ఇంటర్మీడియట్ అధికారులు ప్రకటించారు.కరోనా నేపథ్యంలో ప్రస్తుతం ఆన్ లైన్ లో క్లాసులు నిర్వహిస్తున్నారు. దీంతో సిలబస్ ను తగ్గించారు.