Asianet News TeluguAsianet News Telugu

ట్రంప్ విజయంతో టిడిపికి షాక్

మెప్పు కోసమని భజన మీడియా బృందం ఒక్కోసారి హద్దులు మీరి ప్రవర్తించటం వల్ల చంద్రబాబు నవ్వులపాలు అవుతున్న విషయమన్నా భజన మీడియా గ్రహిస్తున్నదో లేదో.

trump

డొనాల్డ్ ట్రంప్ తెలుగుదేశం పార్టీకి పెద్ద షాకే ఇచ్చారు. అమెరికా ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం హిల్లరీ క్లింటన్ తో పోటీ పడిన డొనాల్డ్ ట్రంప్ సంపూర్ణ విజయం సాధించారు. 45వ అధ్యక్ష పదవికి నువ్వా, నేనా అన్నట్లు పోటీ పడిన డెమక్రట్ పార్టీ అభ్యర్ధిగా హిల్లరీ క్లింటన్ రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా  డొనాల్డ్ ట్రంప్ పోటి పడ్డారు. ఇద్దరి మధ్యా పోటీ నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగుతున్న సమయంలోల ముఖ్యమంత్రి చంద్రబాబునాయడు డొనాల్డ్ ట్రంప్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారు. ట్రంప్ కు వ్యక్తిగత విలువలు లేవని, కుటుంబ విలువలు లేవని తన ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యానించారు.

  దాంతో టిడిపి భజన మీడియా రెచ్చిపోయింది. అమెరికాలో ఉన్న టిడిపి మద్దతుదారులందరికీ హిల్లరీకి ఓట్లు వేయమని, మిగిలిన వారితో కూడా ఓట్లు వేయించాల్సిందిగా టిడిపి ప్రముఖులు చెబుతున్నట్లు భజన మీడియాలో విస్తృతంగా ప్రచారం చేయించుకున్నారు. అంతేకాకుండా ఎన్నికల్లో హిల్లరీ గెలుపు ఖాయమని భజన కూడా చేసారు. పైగా హిల్లరీ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబునాయడు కుటుంబానికి ఆహ్వనాలు కూడా అందినట్లు భజన చేయించుకున్నారు. అందిన ఆహ్వానం మేరకు చంద్రబాబు కూడా అమెరికాకు కుటుంబంతో సహా వెళుతున్నట్లు ప్రచారం కూడా చేయించుకున్నారు.

  అంతే కాకుండా అమెరికాలో ఉంటున్న తమ మద్దతుదారులందరూ హిల్లరీకే ఓట్లు వేయాల్సిందిగా కూడా టిడిపి యంత్రాంగం అనేక రకాలుగా హిల్లరీ గెలుపుకోసం నానా అవస్తలు పడింది. కానీ మంగళవారం ఓట్ల కౌటింగ్ మొదలైన కొంత సేపటి నుండి ట్రంప్ కు వస్తున్న ఆధిక్యతతో ఏదో తమ నేతే ఓడి పోయినట్లు ఢీలా పడ్డాయి. తీరా బుధవారం మధ్యాహ్నానానికి ట్రంప్ విజయం ఖాయమవ్వటంతో టిడిపికి పెద్ద షాకే తగిలినట్లైంది.

మొన్నటి వరకూ హిల్లరీ గెలుపు ఖాయమని జోస్యాలు చెప్పిన, భజన చేసిన భజనమీడియా ఇపుడు ఏమని ప్రచారం చేస్తుందో చూడాలి. మెప్పు కోసమని భజన మీడియా బృందం ఒక్కోసారి హద్దులు మీరి ప్రవర్తించటం వల్ల చంద్రబాబు నవ్వులపాలు అవుతున్న విషయమన్నా భజన మీడియా గ్రహిస్తున్నదో లేదో. ఎందుకంటే, ట్రంప్ విజయం ఖాయమవ్వగానే చంద్రబాబు, హిల్లరీలపైన సోషల్ మీడియాలో విపరీతమైన జోకులు కనబడటమే ఇందుకు నిదర్శనం

Follow Us:
Download App:
  • android
  • ios