MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే

Strong Wind Alert : వాయుగుండం కాదిది వాయు'గండం'.. ప్రచండ గాలులతో ఈ ప్రాంతాల్లో అల్లకల్లోలమే

తెలుగు రాష్ట్రాల్లో ఈ వారం వర్షాల తీవ్రత తక్కువగా ఉంటుందట… ఇదే సమయంలో బలమైన ఈదురుగాలులు బీభత్సం సృష్టించే అవకాశాలున్నాయని వాతావరణ శాఖలు హెచ్చరిస్తున్నాయి. 

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 06 2026, 08:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇక ఈదురుగాలుల బీభత్సమే..
Image Credit : Gemini AI

ఇక ఈదురుగాలుల బీభత్సమే..

Strong Wind Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారిన విషయం తెలిసిందే. ఇది ఒడిశాలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలేమీ ఉండవట... కానీ ఈదురుగాలుల బీభత్సం ఉంటుందని హెచ్చరిస్తున్నారు వాతావరణ నిపుణులు. తీరప్రాంతాల్లో మరింత బలమైన ఈదురుగాలులు వీస్తూ ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి... కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం..
Image Credit : Getty

తెలంగాణలో ఈదురుగాలుల బీభత్సం..

ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గత కొంతకాలంగా కురుస్తున్న వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇదే సమయంలో ఈ జిల్లాలకు ఈదురుగాలుల ప్రమాదం పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో (జూలై 7-11 వరకు) ఈదురుగాలులు వీస్తాయని ప్రకటించింది. రేపు (మంగళవారం) ఈ జిల్లాల్లో 50-60 కిలోమీటర్లు వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. మిగిలిన జిల్లాల్లోనూ 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయంటోంది.

తెలంగాణలో కొద్దిరోజులు వర్షాలకు బ్రేక్ పడనుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు మాత్రమే కురుస్తాయి... కానీ ఈ వారమంతా ఈదురుగాలుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెబుతోంది.

34
హైదరాబాద్ లో గాలి బీభత్సం...
Image Credit : X

హైదరాబాద్ లో గాలి బీభత్సం...

తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో కూడా ఈదురుగాలుల బీభత్సం తప్పదట. ఇప్పటికే గాలి వేగం పెరిగి ప్రమాదాలు జరుగుతున్నాయి... దీని తీవ్రత మరింత పెరగనుందన్న హెచ్చరికలు కంగారు పెడుతున్నాయి. ఈదురుగాలుల దెబ్బకు అసెంబ్లీ ప్రాంగణంలోని భారీ చెట్టు కూలింది... ఆ సమయంలో చెట్టు కింద ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది.

బలమైన ఈదురుగాలులతో ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయి కాబట్టి నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా రోడ్డుపక్కన ఉండే పెద్దపెద్ద హోర్డింగ్స్, కటౌట్లు, చెట్లు, విద్యుత్ స్తంబాలతో ఎక్కువగా ప్రమాదం ఉంటుంది... కాబట్టి ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండాలంటోంది. విద్యుత్ తీగలు తెగిపడే ఆస్కారం ఉంటుంది.

44
ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలుల అలజడే..
Image Credit : Getty

ఆంధ్ర ప్రదేశ్ లో ఈదురుగాలుల అలజడే..

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి బాలాసోర్(ఒడిశా) సమీపంలో తీరాన్ని దాటిందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఇది రాబోయే 24 గంటల్లో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర ఒడిశా, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఛత్తీస్‌గఢ్ మీదుగా కదిలే అవకాశం ఉందని తెలిపారు. 

తీరందాటిన ఈ వాయుగుండం ప్రభావంతో మంగళవారం (07-07-2026) శ్రీకాకుళం జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40-50 కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.. కాబట్టి ఆ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రఖర్ జైన్ సూచించారు.

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో నిన్న (సోమవారం) విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. మిగతా జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిశాయని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. ఒకటిరెండు చోట్ల భారీ వర్షాలు కూడా పడ్డాయని వెల్లడించారు.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
వాతావరణం
ఆంధ్ర ప్రదేశ్
తెలంగాణ
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update: తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. భారీ వర్షాలు, ఈదురుగాలులపై ఐఎండీ అలర్ట్
Recommended image2
ప్యార‌డైజ్ హోట‌ల్‌కు ఆ పేరు ఎలా వ‌చ్చింది.? సినిమా థియేట‌ర్‌కి రెస్టారెంట్‌కి సంబంధం ఏంటి?
Recommended image3
Now Playing
AP Telangana Weather:బంగాళాఖాతంలో కొత్త అల్పపీడనం ఏపీ, తెలంగాణకు భారీ వర్షాల అలర్ట్ | Asianet Telugu
Related Stories
Recommended image1
Weather Update: బంగాళాఖాతంలో అల్పపీడనం.. జూలై 8 వరకు భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు బిగ్ అలర్ట్
Recommended image2
Now Playing
Cyclone alert: బంగాళాఖాతంలో తుపాను..? ఈ జూలైలో జోరువానలు? | Heavy rains AP | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved