తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ఎప్పటికప్పుడు ట్వీట్లతో అభిమానులను పలకరిస్తూనే ఉంటారు.ఆయన ట్విట్టర్ ద్వారా ప్రజలు అడిగిన చాలా సమస్యలకు పరిష్కారం చూపించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాగా.. తాజాగా కేటీఆర్ మరో ట్వీట్ చేశారు. కాగా.. ఆ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తాజాగా సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్న చౌటుప్పల్‌కు చెందిన సత్యనారాయణరెడ్డి, జానకమ్మ దంపతుల గురించి చెబుతూ ట్వీట్ చేశారు. ట్విట్టర్ ద్వారా వారి గొప్పతనాన్ని వివరిస్తూ, అందరిలో స్ఫూర్తి నింపే ప్రయత్నం చేశారు. సత్యనారాయణ రెడ్డి దంపతులు తమ సొంత నిధులతో కోటి రూపాయల విలువ చేసే వృద్ధాశ్రమాన్ని నిర్మించారని.. నిర్వహణ నిమిత్తం దాన్ని ప్రభుత్వానికి అందించారని తెలిపారు. వారి లోకోపకార గుణానికి వందనం అంటూ ట్వీట్ చేశారు. వారితో దిగిన ఫోటోని కేటీఆర్ ట్వీట్ చేశారు.