తాను ఇంకా బతికే ఉన్నానని తెలంగాణ మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.  అదేంటి..? కేటీఆర్ ఇలా ట్వీట్ చేయడం ఏమిటి అనుకుంటున్నారా..? ఓ నెటిజన్ అత్యుత్సాహంతో చూపించిన ప్రేమకి కేటీఆర్ ఇలా బదులిచ్చారు.

ఇంతకీ మ్యాటరేంటంటే... యువతలో కేటీఆర్ కి విపరీతమైన క్రేజ్ ఉన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ అభిమానంతోనే ఓ యువకుడు ఆయన పేరు ట్యాగ్ చేసి మరీ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో జై కేటీఆర్ కి బదులు.. పొరపాటున జోహార్ కేటీఆర్ అంటూ ట్వీట్ చేశారు.

కాగా.. ఆ ట్వీట్ కి కేటీఆర్ తనదైన శైలిలో స్పందించారు. ‘‘బ్రదర్... నేను ఇంకా బతికే ఉన్నాను. అప్పుడే జోహార్ క్లబ్ లో చేరలేదు’’ అంటూ ట్వీట్ చేశారు. కాగా.. ట్వీట్ వైరల్ గా మారింది. ఎప్పుడైతే ట్వీట్ వైరల్ అయ్యిందో.. ఆ నెటిజన్ తాను చేసిన పొరపాటును గ్రహించారు. వెంటనే తన ట్వీట్ ని డిలీట్ చేయడం విశేషం.