Asianet News TeluguAsianet News Telugu

అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు: ఏపీలో రాజకీయాలపై కేటీఆర్ వ్యాఖ్యలు

ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు చేయాలంటే అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉంటూ కూడా రాజకీయాలు చేయవచ్చు అని స్పష్టం చేశారు. 
 

trs working president ktr comments on ap politics
Author
Hyderabad, First Published Jan 5, 2019, 7:04 PM IST


హైదరాబాద్: ఏపీ రాజకీయాలపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో రాజకీయాలు చేయాలంటే అక్కడికే వెళ్లాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. హైదరాబాద్ లో ఉంటూ కూడా రాజకీయాలు చేయవచ్చు అని స్పష్టం చేశారు. 

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు ఎన్నికల ప్రచారం టీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చిందన్న వ్యాఖ్యలను కేటీఆర్ కొట్టపారేశారు. చంద్రబాబు రాకతోనే టీఆర్ఎస్ గెలిచిందంటున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. 

చంద్రబాబు ప్రచారానికి రాకముందే ప్రజలు తమకు ఓటేయాలని డిసైడ్ అయ్యారని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈవీఎం ట్యాంపరింగ్ కంప్యూటర్లను కనిపెట్టిన చంద్రబాబుకే తెలియాలంటూ సెటైర్ వేశారు. 

పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఓటింగ్ శాతం మరింతగా పెరుగుతుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. 16 పార్లమెంట్ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. మహబూబాబాద్, ఖమ్మం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం తగ్గినా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు తమదేనని ఆశాభావం వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ ఓటమి నుంచి తేరుకోలేదని వారికి అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజాకూటమి ఇంకా ఉంటుందా అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీచేస్తుందా? అంటూ ప్రశ్నించారు. కోదండరాంను ప్రజలు తిరస్కరించారని రాజకీయాల్లో కొనసాగడంపై ఆయనే నిర్ణయించుకోవాలని కేటీఆర్ వ్యాఖ్యలు చేశారు. 

ఈ వార్తలు కూడా చదవండి

టోపీ పెట్టం: చంద్రబాబుపై కేటీఆర్ సెటైర్లు

Follow Us:
Download App:
  • android
  • ios