సరదాగా తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయస్సులో పోలీయో మహమ్మారి ఆ బాలుడి దరిచేరింది. దీని కారణంగా రెండు కాళ్లు చచ్చుబడిపోయి మంచానికే పరిమితమవ్వాల్సి వచ్చింది. పేదరికంతో బాధపడుతున్న తల్లిదండ్రులు కొడుకుకు ఖరీదైన వైద్యం చేయించలేక...అతడి అవస్థను చూడలేక రోజూ తీవ్ర మనోవేదనుకు గురయ్యేవారు. చివరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చొరవతో బాలుడికి మెరుగైన వైద్యం అందుతోంది. ఇలా ఓ చిన్నారికి వైద్యసాయం చేయిస్తూ కేటీఆర్ మానవత్వాన్ని చాటుకున్నారు. 

కేటీఆర్ ఆదేశాలతో రామగుండం పట్టణానికి చెందిన పోలియో బాధితుడు శివ సాయి ఆపరేషన్ కు సర్వం సిద్దమైంది.  శుక్రవారం సన్ షైన్ హాస్పిటల్ డాక్టర్ గురువారెడ్డి బాధితుడు శివసాయికి వైద్య పరీక్షలు నిర్వహించారు. తన ఆద్వర్యంలోనే ఫిబ్రవరి మొదటి వారంలో ఆపరేషన్ చేయనున్నట్లు గురువారెడ్డి తెలిపారు. ఈ బాలుడు ఖచ్చితంగా నడుస్తాడని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

ఈ బాధ్యతను తమకు అప్పగించినందుకు కేటీఆర్ గురువారెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ నాయకులు కట్టెల శ్రీనివాస్ యాదవ్ హాస్పిటల్, ప్రభుత్వానికి మధ్య సందానకర్తగా వుంటూ వైద్యసదుపాయానికి సంబంధించిన పనులు తొందరగా పూర్తి అయ్యేటట్లు చర్యలు తీసుకుంటునట్లు డాక్టర్ గురువారెడ్డి వెల్లడించారు.  

సంబంధిత ఫోటోలు

మారోసారి మానవత్వాన్ని చాటుకున్న కేటీఆర్...పోలియో బాలుడికి వైద్యసాయం (ఫోటోలు)