తెలంగాణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొమ్మిది మందితో కూడిన పార్టీ సమన్వయ కమిటీని ప్రకటించారు. ఇప్పటికే క్షేత్రస్ధాయిలో ఎన్నికల బరిలో ముందువరుసలో ఉన్న టీఆర్ఎస్ తదుపరి ఎన్నికల ప్రచారం, ఎలక్షనీరింగ్ వంటి వాటిపై దృష్టి సారించింది.

ఎంఎల్‌ఏలు, ఎంపీలు, మంత్రులతో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తున్న కేటీఆర్.. ప్రతి పురపాలక సంఘంలోని క్షేత్ర స్థాయి పరిస్ధితులను తెలుసుకుంటున్నారు. ఈరోజు పార్టీ కేంద్రకార్యాలయం నుంచి పూర్తి ఎన్నికల ప్రక్రియను సమన్వయం చేసేందుకు పురపాలిక ఎన్నికల కోసం కేంద్ర కార్యాలయ సమన్వయ కమీటీని ఎర్పాటు చేశారు.

Also Read:రెబెల్ అభ్యర్థులపై విపక్షాల చూపు: ఆటలు సాగవన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్

9 మందితో ఎర్పాటుచేసిన ఈ కమీటీ ద్వారా ప్రతి పురపాలికలో పార్టీ కార్యకలాపాలను సమన్వయం చేసుకుంటూ, ఎన్నికల కోసం స్ధానిక నాయకత్వానికి సహాకారం అందిస్తుంది. ఈ కమీటీలో పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్ రెడ్డి, శేరి సుభాష్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొంతు రామ్మోహాన్, గట్టు రాంచందర్ రావు, దండె విఠల్, యంఏల్సీలు శ్రీనివాస్ రెడ్డి, నవీన్ రావులు ఈ కమీటీలో ఉన్నారు.

కమీటీ సభ్యులు జిల్లాల వారీగా ఒక్కోక్కరు భాద్యత తీసుకుని స్దానిక యంఏల్యేలు, సినీయర్ నాయకులతో మాట్లాడాలని కేటీఆర్ సూచించారు. దీంతోపాటు అయా జిల్లాల్లోని ప్రతి పురపాలికల్లోని ఎన్నికలను నేరుగా పర్యవేక్షించాలన్నారు. పోటీచేస్తున్న అభ్యర్ధుల ప్రచారానికి అవసరం అయిన సమాచారాన్ని అందించాలని మంత్రి నేతలకు సూచించారు.

Also Read:కేటీఆర్ కు తలనొప్పులు: దిగిరాని రెబెల్స్, నేతల మధ్య ఆధిపత్యపోరు

ఎన్నికల సందర్భంగా ప్రతిపక్షాలు చేసే విమర్శలకు ధీటుగా సమాధానం ఇవ్వాలని, ఇందుకోసం ప్రతిరోజు పార్టీ నాయకులతో మీడియా సమావేశాలు ఏర్పాటు చేయాలని అదేశించారు. సోషల్ మీడియాలో పార్టీ ప్రచారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సాద్యమైనన్ని ఏక్కువ ఏకగ్రీవాల కోసం ప్రయత్నాలు చేయాలని.. ఎన్నికలు పూర్తి అయ్యేదాకా ఈ కమీటీ ప్రతి రోజు పార్టీ కార్యాలయం నుంచి పనిచేయాలని, సాధ్యమైనంత ఎక్కువ సమయం తెలంగాణ భవన్‌లోనే ఉండాలని కేటీఆర్ ఆదేశించారు.