హైదరాబాద్: వివిధ జిల్లాల్లో పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు కారణంగా మున్సిపల్ ఎన్నికల్లో రెబెల్స్ పోటీకి దిగుతున్నారు. రెబెల్స్ పోటీ నుంచి విరమింపజేయడం తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావుకు తలనొప్పిగా మారింది. నాయకులతో చర్చలు జరిపి బుజ్జగించే ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం ఉండడం లేదు.

దాంతో మున్సిపల్ ఎన్నికల్లో భారీగా నామినేషన్లు దాఖలు కావడం అధికార పార్టీ నేతల్లో టెన్షన్ పెడుతోంది. టిఆర్ఎస్ పార్టీ టికెట్ ఆశించిన నేతలు  పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా ఉన్న వార్డులు డివిజన్లలో 20 వేలకు పైగా నామినేషన్లు దాఖలు కావడం చర్చనీయాంశంగా మారింది.ఈ నేపథ్యంలో అధికార పార్టీ దిద్దుబాటు చర్యలు మొదలు పెట్టింది రెబల్స్ గా రంగంలోకి దిగిన నేతలను  దారికి తెచ్చుకోవడం పై అధికార పార్టీ దృష్టి పెట్టింది.

తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ పార్టీ నేతలతో సంప్రదింపులు జరిపి రెబల్స్ ను ఉపసంహరింపచేసేలా చర్యలు చేపట్టాలని సంబంధిత ఎమ్మెల్యేలకు, ఇన్చార్జి లను ఆదేశించారు. 14వ తేదీ లోపు వ్యవహారం కొలిక్కి తెచ్చేలా చూడాలన్నా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. మున్సిపాలిటీల్లో నెలకున్న తాజా పరిస్థితులను ఎమ్మెల్యేలతో కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు.

 నియోజకవర్గంలో ఉన్న పరిస్థితులను వివరించిన ఎమ్మెల్యేలు రెబల్ అభ్యర్థులే కీలకం అని  కేటీఆర్ కు ఫిర్యాదు వివరుంచినట్లు తెలుస్తుంది. అధికార పార్టీ నుంచి అభ్యర్థులు ఎక్కువగా బరిలో నిలవడంతో వారిని ఒప్పించి పోటీ నుంచి తప్పించడం పైనే టిఆర్ఎస్ దృష్టి పెట్టింది.మరో రెండు రోజులు గడువు ఉండడంతో మెజారిటీ రెబల్ నేతలను కచ్చితంగా ఉపసంహరిస్తామని ఎమ్మెల్యేలు అంటున్నారు. నామినేషన్ల ఉప సంహరణ అనంతరం రెబెల్స్ పై స్పష్టత వచ్చే రానుంది.ఈ విషయంలో  పార్టీ కూడా ఓ నిర్ణయం తెలుకొనెందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది.పలువురు ఎమ్మెల్యే లు నామినేషన్ల పరిశీలన అనంతరం అభ్యర్థులకు బీఫార్మ్ లు ఇవవ్వాలన్న యోచనలో వున్నారు

తాండూరులో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వర్గీయులు నామినేషన్లు వేశారు. దానికి పోటీ అన్నట్లుగా టీఆర్ఎస్ నేత తీగల కృష్ణా రెడ్డి వర్గీయులు నామినేషన్లు దాఖలు చేశారు ఇరు వర్గాల మధ్య కేటీఆర్ రాజీ కుదుర్చడానికి చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదు.

ఇదిలావుంటే, వనపర్తి నియోజకవర్గంలో జూపల్లి కృష్ణా రావు వర్గీయులు పెద్ద యెత్తున నామినేషన్లు దాఖలు చేశారు. జూపల్లిపై మంత్రి నిరంజన్ రెడ్డి, అబ్రహం కేటీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీంతో జూపల్లి కృష్ణారావును కేటీఆర్ తెలంగాణ భవన్ కు పిలిపించారు.