బిజెపిలో చేరిన 200 మంది టిఆర్ఎస్ కార్యకర్తలు (వీడియో)

trs workers joined in bjp
Highlights

హాట్ న్యూస్..

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ నుంచి ఉల్టా వలసలు షురూ అయినట్లు కనబడుతున్నది. తాజాగా తుంగతుర్తి  మండలం రావులపల్లి  X రోడ్డు గ్రామంలో గుగులోతు రామకృష్ణ  ఆధ్వర్యంలో టిఆర్ఎస్ నుండి రెండువందల మంది కార్యకర్తలు బిజెపిలో చేరారు. ఆ పార్టీ నేత సంకినేని  వెంకటేశ్వరరావు సమక్షంలో వీరంతా  బీజేపీలో చేరినట్లు ఒక ప్రకటనలో తెలిపారు.

పార్టీలో చేరిన వారిలో  గుగులోతు సంతోష్, మధ్యా, గుగులోతు వెంకన్న , భూక్యా పాండు, భూక్య రవి,G హరిసింగ్ , భూక్యా శ్రీను తదితరులు ఉన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు సత్యనారాయణ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు గాజుల మహేందర్ గారు, సలిగంటి వీరేంద్ర, శంకర్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో సంకినేని ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ వీడియో కింద ఉంది చూడండి.

 

loader