వచ్చే రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటింగ్ కు టీఆర్ఎస్ దూరంగా ఉండాలని భావిస్తోంది. ఎన్డీఏ ప్రతిపాదించే అభ్యర్థికి లేదా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చే అభ్యర్థికి ఓటు వేయకూడదని అనుకుంటోంది. బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరంగా ఉంటుందని ఇటీవల ఆ పార్టీ స్పష్టం చేసింది.
రాష్ట్రపతి ఎన్నికలకు తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ దూరంగా ఉండే అవకాశం కనిపిస్తోంది. తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బుధవారం నిర్వహించిన బీజేపీయేతర పార్టీల సమావేశానికి టీఆర్ఎస్ దూరంగా ఉంది. కాంగ్రెస్ తో కలిసి వేధికను పంచుకోవడం ఇష్టం లేకపోవడమే దీనికి కారణమని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే రాష్ట్రపతి ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ సమర్ధించే అభ్యర్థికి మద్దతు ఇవ్వకూడదని టీఆర్ఎస్ భావిస్తోంది. అలాగే బీజేపీ అభ్యర్థికి కూడా అనుకూలంగా ఓటు వేయకూడదని అనుకుంటోందని ఆ పార్ట నాయకులు చెబుతున్నారు.
Gopalkrishna Gandhi: రాష్ట్రపతి ఎన్నికలు 2022: బరిలో నిలవబోతున్న గోపాలకృష్ణ గాంధీ ఎవరు?
2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ను ఏర్పాటు చేయడానికి ప్రాంతీయ పార్టీ నేతలను కలిసేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఇక ప్రయత్నాలు చేయాలని అనుకోవడం లేదు. దానికి బదులుగా తన ప్రతిపాదిత జాతీయ పార్టీని బలోపేతం చేయడం, విస్తరించడంపై దృష్టి పెట్టాలని భావిస్తున్నారు. ఢిల్లీలో మమతా బెనర్జీ సమావేశం నుంచి వైదొలగాలని పార్టీ నాయకత్వం తన నిర్ణయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ‘‘టీఆర్ఎస్ రెండు జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు సమాన దూరం పాటిస్తుంది ’’ అని పేర్కొంది.
బుల్డోజర్లు మీ ఇంటికి కూడా రావొచ్చు.. ఆనంద పడకండి - రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్
బీజేపీ నేతృత్వంలోని ఎన్ డీఏ అభ్యర్థికి లేదా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ అభ్యర్థికి లేదా కాంగ్రెస్ మద్దతుతో ప్రతిపక్ష పార్టీలు నిలబెట్టిన ఏ ఇతర అభ్యర్థికి టీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోదని ఈ ప్రకటన స్పష్టం చేస్తోంది. అయితే టీఆర్ఎస్ తన వైఖరికి కట్టుబడి ఉండాలంటే రాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా ఉండటం తప్ప వేరే మార్గం లేదు. కాగా కాంగ్రెస్ పార్టీ మమతా బెనర్జీని సమావేశానికి ఆహ్వానించడం, ఇతర బీజేపీయేతర పార్టీలను సంప్రదించకుండా ప్రతిపక్ష పార్టీల తరఫున రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయడానికి ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ ను సంప్రదించడంపై టీఆర్ఎస్ నాయకత్వం మండిపడింది.
‘నేను ఆవుపేడను విసిరాను.. రాళ్లు రువ్వలేదు’.. మద్యం దుకాణంపై మాజీ సీఎం దాడి..
ప్రముఖ బీజేపీయేతర నేతలు మమతా బెనర్జీ, శరద్ పవార్లను పరోక్షంగా విమర్శించడం, వ్యతిరేకించడం ద్వారా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 2024 లోక్ సభ ఎన్నికల్లో తాను ఏ ప్రాంతీయ పార్టీలతో ఫ్రంట్ ఏర్పాటు చేయబోవడం లేదని, సొంతంగా జాతీయ పార్టీ ఏర్పాటు చేస్తున్నానని ప్రత్యక్షంగా సందేశాన్ని పంపించారు.
