TRS Plenary దేశంలో మతోన్మాద శక్తులు తాండవమాడుతున్నాయి: కేశవరావు


టీఆర్ఎస్ 21వ వార్షికోత్సవ సమావేశంలో టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కేశవరావు స్వాగతోపాన్యాసం చేశారు.  టీఆర్ఎస్  ప్లీనరీ లో ఏయే అంశాలను ప్రస్తావించాలనే విషయమై కేశవరావు తెలిపారు.

TRS Secretary General Keshava Rao Slams BJP In TRS Plenary

హైదరాబాద్: దేశంలో ధరలు ఆకాశాన్ని అంటాయని టీఆర్ఎస్ సెక్రటరీ జనరల్ కె. కేశవరావు చెప్పారు.
TRS Plenary లో Keshava Rao  స్వాగతోపాన్యాసం చేశారు. దేశంలో Telanganaరాష్ట్రం అభివృద్దిలో ముందుకు సాగుతుందన్నారు. దేశం సంక్షేమ లక్ష్యాలను తప్పిందన్నారు. అభివృద్ది కుంటుపడిందని ఆయన చెప్పారు. మతోన్మాద శక్తులు, విచ్చిన్నకర శక్తులు ఎప్పుడూ లేని విధంగా తాండవమాడుతున్నాయన్నారు. ఇదే పరిస్థితి కొన్నేళ్లు కొనసాగితే దేశమే కనుమరుగు కానుందని ఆయన అభిప్రాయపడ్డారు.దేశ ఆర్ధిక పరిస్థితి గమ్యం తప్పిందన్నారు.దేశంలో మౌలిక మార్పుల కోసం స్ట్రక్చరల్ మార్పులు రావాల్సిన అవసరం ఉందని  టీఆర్ఎస్ నేత చెప్పారు.

మన అస్థిత్వమే రాజ్యాంగంపై ఆధారపడి ఉందన్నారు.మనది సమాఖ్య రాష్ట్రమా, కేంద్రీకృత రాష్ట్రమా అనే మీమాసం వెంటాడుతుందని కేశవరావు తెలిపారు.ప్రజల గురించి రాజ్యాంగమా, రాజ్యంగం పరిధిలో ప్రజలా అనే విషయమై తేల్చుకోవాల్సిన అవసరంం ఉందన్నారు. 
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios