కొత్తగా ఎన్నికైన టిఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ముగ్గురు సభ్యుల్లో ముందుగా బండ ప్రకాష్ ముదిరాజ్ ప్రమాణం చేశారు. బండ ప్రకాశ్ తెలుగులో ప్రమాణం చేయగా తర్వాత జోగినిపల్లి సంతోష్ వంతు వచ్చింది. ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు వస్తున్న సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలుగులోనే ప్రమాణం చేయాలని సంతోష్ కు సలహా ఇచ్చారు.

అయితే మొదట బండ ప్రకాష్ ప్రమాణం తెలుగులోనే చేశారు. తర్వాత సంతోష్ ప్రమాణం చేసే సమయంలో వెంకయ్య నాయుడు తెలుగులో అని సూచించడంతో సంతోష్ కూడా తెలుగులోనే ప్రమాణ స్వీకారం చేశారు. సంతోష్ తర్వాత బడుగుల లింగయ్య యాదవ్ ప్రమాణం చేశారు.

వీరి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిఆర్ఎస్ శ్రేణులు భారీగా హస్తినబాట పట్టారు. సిఎం కేసిఆర్ సతీమణి శోభ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరు ప్రమాణం చేసిన వీడియో పైన ఉంది చూడొచ్చు.