టీఆర్ఎస్ రెండో జాబితాను విడుదల చేసింది. 20 మంది అభ్యర్ధులతో టీఆర్ఎస్ గురువారం నాడు రెండో జాబితాను విడుదల చేసింది.జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధుల మొదటి జాబితాను ఈ నెల 18వ తేదీ రాత్రి టీఆర్ఎస్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇంకా 25 మంది అభ్యర్ధుల జాబితాను మరో జాబితాలో ప్రకటించనుంది.

 

మల్లాపూర్- దేవేందర్ రెడ్డి
రామాంతపూర్ - గంధం జోత్స్న
బేగంబజార్- పూజ వైశ్యబిలాల్
సులేమాన్ నగర్-  సరితా మహేష్
శాస్త్రిపురం- బి. రాజేష్ యాదవ్
మైలార్ దేవ్ పల్లి- టి. ప్రేమ్ దాస్ గౌడ్
రాజేంద్రనగర్- కొరణి శ్రీలత
హిమాయత్ నగర్ - హేమాలత యాదవ్
బాగ్ అంబర్ పేట-  పద్మావతి రెడ్డి
బోలక్ పూర్-  బింగి నవీన్ కుమార్
షేక్‌పేట - ఎం. సత్యనారాయణ యాదవ్
శేరిలింగంపల్లి- రాగం నాగేంద్రయాదవ్
బాలానగర్-  రవీంద్రరెడ్డి ఆవుల
కూకట్‌పల్లి-  సత్యనారాయణ జూపల్లి
వివేకానందనగర్ కాలనీ-  మాధవవరం రోజా రంగారావు
వినాయక్ నగర్ కాలనీ-  బద్దం పుష్పలతా రెడ్డి
అడ్డగుట్ట-  ప్రసన్నలక్ష్మి
మెట్టుగడ్డ- ఆర్.సునీత
బౌద్దనగర్ - కంది శైలజ
బేగంపేట- మహేశ్వరి శ్రీహారి

రెండో జాబితాలో టీఆర్ఎస్ ఆరుగురు సిట్టింగ్ లకు సీట్లు ఇవ్వలేదు. ఇప్పటివరకు 125 మందితో టీఆర్ఎస్ రెండు జాబితాలను విడుదల చేసింది. ఈ 125 మందిలో 10 మంది సిట్టింగ్ లకు టీఆర్ఎస్ టికెట్లు ఇవ్వలేదు. ఇంకా 25 మంది అభ్యర్ధుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేయనుంది. ఈ జాబితాలో ఎందరు సిట్టింగ్ లకు ఛాన్స్ కల్పిస్తోందనే విషయమై కొన్ని గంటల్లోనే తేలనుంది.