త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్య్ర అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. 

టికెట్ ఇస్తానని ఆశపెట్టి..తనను కేసీఆర్ మోసం చేశాడని.. టీఆర్ఎస్ రెబల్ నేత, స్వతంత్య్ర అభ్యర్థి గండ్ర సత్యనారాయణ ఆరోపించారు. త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో స్వతంత్ర్య అభ్యర్థిగా ఆయన ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ఆయన చేపట్టిన రోడ్ షోకి అనూహ్య స్పందన లభించింది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... నియోజకవర్గంలో ఇంతవరకు సాగిన అవినీతి పాలనను ఇక ప్రజలు బొందపెట్టాలన్నారు. ఇంతకాలం అసమర్థులు నియోజకవర్గాన్ని పాలించి ప్రజల బతుకులతో ఆడుకున్నారని ఆయ న విమర్శించారు. నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాలను ముగ్గురు కొడుకులతో కలిసి స్పీకర్‌ లూటీ చేయించారన్నారు.

ప్రజా సేవ చేసుకుంటూ ప్రజల్లో ఉంటున్న తనను గుర్తించిన కేసీఆర్‌ తన కొడుకు కేటీఆర్‌, అల్లుడు హరీష్‌రావు, వినోద్‌కుమార్‌లు నావద్దకు పంపించి భూపాలపల్లి ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇస్తానని నమ్మబలికారన్నారు. పట్టుబట్టి నన్ను పార్టీలోనికి తీసుకొచ్చి సీటు ఇవ్వకుండా దారుణంగా మోసం చేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.