ప్రగతి నివేదన సభకు రూట్ మ్యాప్ ఇదే

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 1, Sep 2018, 4:31 PM IST
Trs pragathi nivedana sabha rout map
Highlights

 టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన భారీ బహిరంగ సభకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. 25 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నలు దిక్కుల నుంచి వచ్చే అశేష జనవాహిని చేరుకునేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది అధికార యంత్రాంగం.సెప్టెంబర్2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగే ఈ ప్రగతినివేదన భారీ బహిరంగసభకు తెలంగాణలోని 31 జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. 

హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రగతి నివేదన భారీ బహిరంగ సభకు రూట్ మ్యాప్ సిద్ధమైంది. 25 లక్షల మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నలు దిక్కుల నుంచి వచ్చే అశేష జనవాహిని చేరుకునేందుకు రూట్‌మ్యాప్ సిద్ధం చేసింది అధికార యంత్రాంగం.సెప్టెంబర్2న రంగారెడ్డి జిల్లా కొంగరకలాన్‌లో జరిగే ఈ ప్రగతినివేదన భారీ బహిరంగసభకు తెలంగాణలోని 31 జిల్లాల నుంచి ప్రజలు తరలిరానున్నారు. 

సభకు వచ్చే వారి కోసం రోడ్డుమార్గాలు, పార్కింగ్‌స్థలాలను సూచిస్తూ పోలీస్ శాఖ రూట్ మ్యాప్ విడుదల చేసింది. 25 లక్షల మందికిపైగా ప్రజలు తరలిరానుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 

రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే వాహనాలు ఏమార్గంలో ప్రయాణించాలి, పార్కింగ్ స్థలం ఎక్కడ అనేదానిపై మ్యాప్‌ను రూపొందించారు. 1500 ఎకరాల్లో ఏర్పాటుచేసిన 20 పార్కింగ్ ప్రదేశాల్లో దాదాపు లక్ష వాహనాలను నిలిపేలా రూట్ మ్యాప్ ను తయారు చేశారు. జిల్లాల వారీగా వచ్చే వాహనాలు ఎక్కడ పార్కింగ్ చెయ్యాలో అన్న అంశాన్ని పోలీస్ శాఖ క్లియర్ గా తెలియజేసింది. 

విజయవాడ హైవేలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాలతోపాటు, నల్లగొండ జిల్లాలోని నకిరేకల్, నల్లగొండ, మునుగోడు నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు పెద్ద అంబర్‌పేట ఓఆర్‌ఆర్ వద్ద సర్వీస్‌రోడ్డు నుంచి కోహెడ, మంగల్‌పల్లి మీదుగా కొంగరకలాన్‌కు చేరుకుని జాక్‌పాట్ వెంచర్/ టీఎస్‌ఐఐసీ భూముల్లో పార్కింగ్ చేయాలని పోలీసులు సూచించారు.
 
సాగర్ వైపునుంచి వచ్చే నాగార్జునసాగర్, దేవరకొండ, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల నుంచి వచ్చే వాహనాలు ఇబ్రహీంపట్నంలోని శస్త్ర ఫంక్షన్‌హాల్ వద్ద ఎడమ వైపు తిరిగి ఎలిమినేడు-కొంగరకలాన్ రంగారెడ్డి కలెక్టరేట్ పక్కన ఉన్న జాక్‌పాట్ వెంచర్/టీఎస్‌ఐఐసీ భూముల్లో పార్కింగ్ చేసేలా రూట్ మ్యాప్ లో పొందుపరిచారు.
 
శ్రీశైలం హైవేలో అచ్చంపేట, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, మహేశ్వరం నుంచి వచ్చేవాహనాలు రాచులూర్ గేట్ నుంచి తిమ్మాపూర్-కొంగరకలాన్ రంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ఉన్న జాక్‌పాట్/టీఎస్‌ఐఐసీ భూముల్లో వాహనాలను పార్క్ చేయాలని సూచించారు.
 
మహబూబ్‌నగర్ వైపునుంచి వచ్చే గద్వాల, ఆలంపూర్, వనపర్తి, జడ్చర్ల, మహబూబ్‌నగర్, దేవరకద్ర, కొడంగల్, మక్తల్, నారాయణ్‌పేట, షాద్‌నగర్ వాహనాలు పాలమాకుల స్వర్ణభారతి ట్రస్ట్, పెద్దగొల్కొండ సర్వీస్‌రోడ్డుకు వచ్చి ఫ్యాబ్‌సిటీ వద్ద పార్క్‌చేయాలని పోలీసులు తెలిపారు.

 నిజామాబాద్, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, బోథ్, ఖానాపూర్, నిర్మల్, మెదక్, మేడ్చల్, కుత్బుల్లాపూర్ వాహనాలు మేడ్చల్/ కండ్లకోయ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి పటాన్‌చెరు, గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా తుక్కుగూడ ఎగ్జిట్ -14 వద్ద దిగాలి. అక్కడి నుంచి ఫ్యాబ్‌సిటీ భూముల్లో పార్కింగ్ చేసేలా చర్యలు తీసుకున్నారు. 

వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల నియోజకవర్గాలవారు టీఎస్‌పీఏ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి వచ్చి తుక్కుగూడ వద్ద దిగి ఎగ్జిట్-14 వద్ద కిందకు దిగాలి. అక్కడ నుంచి నేరుగా ఫ్యాబ్‌సిటీ భూముల్లో పార్కింగ్ చేయాలి.
 
వరంగల్, మంథని, ములుగు, భూపాలపల్లి, వర్దన్నపేట, డోర్నకల్, స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, నర్సంపేట, మహబూబాబాద్, పాలకుర్తి, తుంగతుర్తి, జనగామ, భువనగిరి నుంచి వచ్చే వాహనాలు ఘట్‌కేసర్ వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి, బెంగళూర్ వద్ద ఉన్న ఓఆర్‌ఆర్ ఎగ్జిట్-12 వద్ద దిగి సర్వీస్ రోడ్డు ద్వారా కల్వకోలు లక్ష్మిదేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద నిలిపాలి.
 
సిద్దిపేట, సిర్పూర్, బెల్లంపల్లి, ఆదిలాబాద్, చెన్నూరు. మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్, హుస్నాబాద్, హుజూరాబాద్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, వేములవాడ, దుబ్బాక, గజ్వేల్ నుంచి వచ్చే వాహనాలు శామీర్‌పేట్ వద్ద ఓఆర్‌ఆర్‌పైకి ఎక్కి ఘట్‌కేసర్ మీదుగా బొంగుళూర్ వద్ద ఎగ్జిట్-12 వద్ద దిగాలి. అక్కడినుంచి సర్వీస్‌రోడ్డులో లక్ష్మిదేవమ్మ ఫంక్షన్ హాల్ వద్ద పార్క్ చేయాలి.

సికింద్రాబాద్, ముషీరాబాద్, మల్కాజిగిరి, అంబర్‌పేట, ఉప్పల్, మలక్‌పేట వైపునుంచి వచ్చేవారు ఎల్బీనగర్, సాగర్‌రింగ్‌రోడ్డు, మంద మల్లమ్మ గార్డెన్ నుంచి పహాడీషరీఫ్ మీదుగా ఆగర్‌ఖాన్ అకాడమీ నుంచి సమీపంలోని వండర్‌లా వద్ద వాహనాలు నిలపాలి.

ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి, రాజేంద్రనగర్, కార్వాన్ నుంచి వచ్చేవారు టీఎస్‌పీఎస్ ఓఆర్‌ఆర్ ఎక్కి తుక్కుగూడ ఎగ్జ్సిట్-14 వద్ద దిగి అక్కడి నుంచి ప్యాబ్‌సిటీ వద్ద వాహనాలు నిలపాలి.

కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి, సనత్‌నగర్ వైపునుంచి వచ్చేవారు పటాన్‌చెరు వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కాలి. గచ్చిబౌలి, శంషాబాద్ మీదుగా తుక్కుగూడ వద్ద ఉన్న ఎగ్జిట్- 14 వద్ద కిందకుదిగి.. ఫ్యాబ్‌సిటీ వద్ద వాహనాలను పార్క్‌చేయాలి.
 
చార్మినార్, సంతోష్‌నగర్, చాదర్‌ఘాట్, బహదూర్‌పురా, యాకుత్‌పురా, గోషామహల్ వైపు నుంచి వచ్చేవానాలు చాంద్రాయణగుట్ట, పహాడీషరీఫ్ మీదుగా ఆగాఖాన్ అకాడమీ నుంచి వండర్‌లా వద్ద పార్క్‌చేయాలి. జహీరాబాద్, అందోల్, సంగారెడ్డి వాహనాలు పటాన్‌చెరు వద్ద ఓఆర్‌ఆర్ పైకివచ్చి ప్యాబ్‌సిటీ వద్ద పార్కింగ్ చేయాలి.

 

 

loader