Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణ అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఇదే

తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న ఊహాగానాలు తెరపడనుంది. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ మెుగ్గు చూపడంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు దిశగా  ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 6న అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

trs party ready to early elections
Author
Hyderabad, First Published Sep 4, 2018, 8:33 PM IST

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ వస్తున్న ఊహాగానాలు తెరపడనుంది. ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ మెుగ్గు చూపడంతో తెలంగాణ అసెంబ్లీ రద్దు దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీ రద్దుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ రద్దు ముహూర్తాన్ని ఖరారు చేసుకున్నట్లు సమాచారం. ఈనెల 6న అసెంబ్లీని రద్దు చేయనున్నట్లు టీఆర్ఎస్ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. 

ఈనెల 6న ఉదయం 6గంటల 45 నిమిషాలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ భేటీలో అసెంబ్లీ రద్దు, ముందస్తు ఎన్నికలు అంశాలపై చర్చించనున్నారు. అలాగే గతంలో జరిగిన ముందస్తు ఎన్నికలు, ఫలితాలు అప్పటి రాజకీయ పరిస్థితులు ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు. ఆ తర్వాత అసెంబ్లీ రద్దుపై కేబినెట్ తీర్మానం చేయనున్నట్లు సమాచారం. కేబినేట్ తీర్మానం తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  

Follow Us:
Download App:
  • android
  • ios