హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రసమితి పార్టీ మేనిఫెస్టో విడుదలకు ముహూర్తం కన్ఫమ్ అయ్యింది. పరేడ్ గ్రౌండ్ వేదికగా తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 26 మంది ఎమ్మెల్యేలతో నిర్వహించబోయే భారీ బహిరంగ సభలో ఈ మేనిఫెస్టోను విడుదల చెయ్యాలని టీఆర్ఎస్ పార్టీ భావిస్తోంది. అందుకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ పాక్షిక మేనిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే. 

ఇకపోతే ఈ మేనిఫెస్టోలో 24 అంశాలపైనే ప్రధానంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. 24 అంశాలే ప్రధాన అజెండాగా మేనిఫెస్టోను రూపొందించారు. ఉద్యోగుల పదవీ విరమణ వయసు 61 ఏళ్ల పెంపు, దివ్యాంగుల పెన్షన్ రూ.1500 నుంచి 3016కు పెంపు, ఆసరా పెన్షన్లు రూ.2016కు పెంపు, రైతులకు రూ.లక్ష ఏకకాలంలో రైతు రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. 

అలాగే ప్రతీ రెండు నియోజకవర్గాలకు మధ్యలో ఒక ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ ను ఏర్పాటు చెయ్యాలని అలాగే, ఐకేపీ ఉద్యోగలకు ప్రభుత్వమే జీతభత్యాలు చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించనుంది. డబుల్ బెడ్ రూం ఇళ్లకు సంబంధించి సొంత భూమి ఉన్న వారు కూడా ఇళ్లు కట్టుకునేలా మరో అవకాశం కల్పిస్తూ నిర్ణయం. 

క్ష రూపాయలు రైతు రుణమాఫినీ రెండు దఫాలుగా చేస్తామని తెలిపారు. రైతు బంధు పథకం కింద ఎకరానికి సంవత్సరానికి రూ.10వేలు చెల్లిస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితులను మరింత బలోపేతం చేస్తామని తెలిపారు. రైతు సమన్వయ సమితులకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. 

నియోజకవర్గానికి రెండు చొప్పున ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ తెలిపారు. ఐకేపీ ఉద్యోగులకు ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్ బాధ్యత అప్పగించనున్నట్లు తెలిపారు. 70శాతం రుణాలతో ఫుడ్ ప్రోసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.  

ఇకపోతే 57ఏళ్లు దాటిని వారందరికీ పెన్షన్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. దీనివల్ల 8లక్షల మంది అదనంగా లబ్ధి పొందనున్నారు. వితంతువులకు వికలాంగులు రూ.1500 నుంచి రూ.3016కు పెంపు, ఆసరా పెన్షన్లు రూ.1000 నుంచి 2016రూపాయలకు పెంపు వంటి హామీలు మేనిఫెస్టోలో పొందుపరిచారు.  

ఈ ఏడాది కొత్తగా నిరుద్యోగ భృతి పథకాన్ని ప్రవేశపెట్టనున్నారు. ప్రతి నెల నిరుద్యోగులకు రూ.3016 నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. 100శాతం సబ్సిడీతో ఇళ్లు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. రెండు తరాల వరకు గృహం సమస్య లేకుండా ఉండేలా పక్కా ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నారు. 

2లక్షల 60వేల డబుల్ బెడ్ రూంల ఇళ్లు నిర్మించేలా ప్రణాళికలు. లబ్ధిదారులకు భూమి ఉంటే ఆ భూమిలో ఇళ్లు నిర్మించుకునేలా చర్యలు. ఎస్సీ ఎస్టీలకు సబ్ ప్లాన్ తోపాటు అదనంగా మరిన్ని సంక్షేమ పథకాలను కూడా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎస్సీలకు ఏడాదికి రూ.15వేల కోట్లతో అభివృద్ధి పథకాలు అమలు. 

అలాగే రూ.6 నుంచి 10వేల కోట్లు గిరిజనుల అభివృద్ధికి కేటాయింపు. అగ్రకులంలో పేదరికంలో మగ్గుతున్న రెడ్డి సామాజిక వర్గం, ఆర్య వైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుపై కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. 

టీఆర్ఎస్ మేనిఫెస్టోపై తెలంగాణ ప్రజలతోపాటు అన్ని పార్టీలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే అన్ని పార్టీలు మేనిఫెస్టోలు విడుదల చేసిన నేపథ్యంలో అధికార పార్టీ ఏ హామీలు మేనిఫెస్టోలు పెట్టిందా అంటూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

మరోవైపు గులాబీ జాతరకు పరేడ్‌గ్రౌండ్ ముస్తాబవుతుంది. ఈరోజు సాయంత్రం గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అభ్యర్థుల తరఫున జరిగే బహిరంగ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ మేనిఫెస్టోను విడుదల చెయ్యనున్నట్లు సమాచారం.