జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగంగా రాంగోపాల్ పేట, జంగంమెట్, బీఎణ్ రెడ్డి, మూసాపేట డివిజన్ల ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది.

ఇక్కడ తమకు అనుమానాలు వున్నాయని ఆయా పార్టీలు రీకౌంటింగ్‌కు పట్టుబడుతున్నాయి. మరోవైపు చివరి రౌండ్లలో అనూహ్యంగా బీజేపీ ముందుకొచ్చింది.

ఇప్పటి వరకు 51 డివిజన్లలో టీఆర్ఎస్ విజయం సాధించగా... 41 డివిజన్లలో ఎంఐఎం, 2 డివిజన్‌లలో కాంగ్రెస్ గెలుపొందాయి. అయితే 15 డివిజన్‌లలో ఫలితం తేలాల్సి వుంది.

2016తో పోలిస్తే బీజేపీ బలం గణనీయంగా పెరిగింది. అటు బీఎన్ రెడ్డి నగర్‌లో ఫలితాల ప్రకటనలో వివాదం చోటు చేసుకుంది. ఫలితాల ప్రకటనను టీఆర్ఎస్ ఏజెంట్లు అడ్డుకోవడంతో కలకలం రేగింది. ఇకపోతే ఎంఐఎం పట్టున్న జాంబాగ్‌ను బీజేపీ కైవసం చేసుకోవడం గమనార్హం