Asianet News TeluguAsianet News Telugu

టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్ధులను ఖరారు చేసిన కేసీఆర్.. లిస్ట్ ఇదే

త్వరలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు సుదీర్ఘ  కసరత్తు అనంతరం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్ధులను ఖరారు చేశారు. 
 

trs party announced rajya sabha candidates list
Author
Hyderabad, First Published May 18, 2022, 4:59 PM IST

త్వరలో తెలంగాణ రాష్ట్రం నుంచి ఖాళీ కానున్న రాజ్యసభ స్థానాల భర్తీకి సంబంధించి టీఆర్ఎస్ పార్టీ ముగ్గురు అభ్యర్ధులను ప్రకటించింది. ఈ మేరకు సుదీర్ఘ  కసరత్తు అనంతరం టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అభ్యర్ధులను ఖరారు చేశారు. ఇద్దరు ఓసీ, ఒక బీసీలకు ముఖ్యమంత్రి అవకాశం కల్పించారు. 

టీఆర్ఎస్ రాజ్యసభ  అభ్యర్ధులు వీరే:

  • పార్థసారథి రెడ్డి (హెటిరో డ్రగ్స్ అధినేత) 
  • గాయత్రి రవి
  • దామోదర్ రావు (నమస్తే తెలంగాణ ఎండీ)

కాగా.. Andhra Pradesh, Telangana సహా 15 రాష్ట్రాల్లోని 57 రాజ్యసభ స్థానాలకు గత గురువారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 10న రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ లో 4, తెలంగాణలో రెండు Rajaya Sabha స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ నుండి సురేష్ ప్రభు, టీజీ వెంకటేష్, వైఎస్ చౌదరి (సుజనా చౌదరి), విజయసాయి రెడ్డిలు ఈ ఏడాది జూన్ 21న రిటైర్ కానున్నారు. తెలంగాణ నుండి డి.శ్రీనివాస్ (డీఎస్), వొడితెల లక్ష్మీకాంతరావులు రిటైర్ అవుతారు.

ఈ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 24న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు.అదే రోజు నుండి నామినేషన్లను స్వీకరిస్తారు. నామినేషన్ల దాఖలుకు మే 31 వరకు గడువు విధించారు. జూన్ 1న నామినేషన్లను పరిశీలించనున్నారు. జూన్ 3న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. జూన్ 10న రాజ్యసభ ఎన్నికలను జరిపి, అదే రోజున కౌంటింగ్ నిర్వహిస్తారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios