టీఆర్ఎస్ పార్టీకి షాక్ : కాంగ్రెస్ లో చేరిన పరకాల మున్సిపల్ ఛైర్మన్

TRS parkal muncipal chairman joins congress
Highlights

అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీనాయకులు, పరకాల మున్సిపల్ కౌన్సిలర్ మార్తిరాజు భద్రయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఉత్తమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రయ్యతో పాటు అతడి అనుచరులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.

అధికార టీఆర్ఎస్ పార్టీకి ఉమ్మడి వరంగల్ జిల్లాలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. టీఆర్ఎస్ పార్టీ నాయకులు, పరకాల మున్సిపల్ కౌన్సిలర్ మార్తిరాజు భద్రయ్య కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుని టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. హైదరాబాద్ లోని ఉత్తమ్ ఇంట్లో జరిగిన ఈ కార్యక్రమంలో భద్రయ్యతో పాటు అతడి అనుచరులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ లో చేరారు.

ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ...2019 సార్వత్రిక ఎన్నికల్లో అటు దేశంలోను, ఇటు రాష్ట్రంలోను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు. పార్టీని గెలిపించి కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేస్తామని ఉత్తమ్ తెలిపారు.

తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పాలనలో విసుగు చెందారని, 60 ఏళ్లుగా తెలంగాణ ప్రజలు కంటున్న కలలకు వ్యతిరేకంగా ప్రస్తుత పాలన సాగుతోందని ఉత్తమ్ మండిపడ్డారు. ఈ పాలన ఆ పార్టీ నాయకులకు సైతం నచ్చడంలేదన్నారు. దీంతో పాటు కాంగ్రెస్ పార్టీపై నమ్మకంతోనే అధికార పార్టీ నుండి వలసలు పెరుగుతున్నాయన్నారు. భవిష్యత్ లో కేవలం టీఆర్ఎస్ నుండే కాకుండా ఇతర పార్టీల నుండి కూడా  భారీగా చేరికలుంటాయని ఉత్తమ్ తెలిపారు. 

తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేసిన నాయకులతో టీఆర్ఎస్ పార్టీ నిండిపోయిందని విమర్శించారు. ఇలాంటి పార్టీలో ఉండలేకే పరకాల మున్సిపల్ చైర్మన్ అధికార పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరారని తెలిపారు. ఈ చేరికలతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతమైందని ఉత్తమ్ అన్నారు.
 
 
 

loader