రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొన్న రైతుల్లో భరోసా నింపేందుకు రాహుల్ గాంధీ మే 6వ తేదీన వరంగల్ కు వస్తున్నారని సీఎల్పీ నేతఈ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు.
హైదరాబాద్: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకొన్న రైతుల్లో భరోసా నింపేందుకే AICC మాజీ చీఫ్ Rahul Gandhi రాష్ట్రంలో పర్యటించేందుకు వస్తున్నారని Mallu Bhatti Vikramarka చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో సబ్సిడీతో ఎరువులు, విత్తనాలతో పాటు పలు పరికరాలను ఇచ్చే విషయాన్ని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ ఇస్తామని KCR హామీ ఇచ్చారన్నారు.
కానీ రైతుల రుణాలను ఇంకా మాఫీ చేయలేదన్నారు. రుణ భారం లక్ష దాటి పోయిందన్నారు. ప్రస్తుతం ఈ రుణ భారం రూ. 4 లక్షలకు చేరిందని భట్టి విక్రమార్క చెప్పారు.టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను అమలు చేయలేదన్నారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పంచిన భూముల్లో Telangana ప్రభుత్వం ప్లాటింగ్ చేస్తుందన్నారు. తాము అధికారంలోకి వస్తే వ్యవసాయానికి ఏం చేస్తామనేది రాహుల్ గాంధీ వివరిస్తారన్నారు.2014 నుండి 2018 వరకు కూడా నిర్మల్, సంగారెడ్డితో పాటు పలు ప్రాంతాల్లో కూడా భారీ ఎత్తున బహిరంగ సభలను నిర్వహించిన విషయాన్ని ఆయన భట్టి విక్రమార్క గుర్తు చేశారు. వచ్చే నెల 6న Warangal లో నిర్వహించే Congress పార్టీ సభను జయప్రదం చేయాలని ఆయన కోరారు. గుజరాత్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జిగ్నేష్ మేవాన్ ను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. దళితులు బీజేపీని ఏనాడూ కూడా నమ్మరని చెప్పారు.
మాజీ పీసీసీ అధ్యక్షుడు Uttam Kumar Reddy మాట్లాడుతూ రాష్ట్రంలో రాహుల్ గాంధీ పర్యటనను విజయవంతం చేయడం కోసం తాము ప్రణాళికను సిద్దం చేసుకొన్నామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నట్టేట ముంచాయన్నారు. ఈ యాసంగిలో సీజన్ లో సుమారు 17 లక్షల ఎకరాల్లో రైతులు ఎలాంటి పంట పండించలేదన్నారు. రైతులు రెండో పంట వేయకుండా ఆదాయాన్ని కోల్పోయారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. రా రైస్, బాయిల్డ్ రైస్ అంటూ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం పరస్పరం విమర్శలు చేసుకొన్నారన్నారు.
ఆలస్యంగా Paddy ధాన్యం కొనుగోలు ప్రారంభించడంతో ఇప్పటికే ధాన్యం విక్రయించిన రైతులు నష్టపోయారని చెప్పారు. కేసీఆర్ ముందు చూపు లేని కారణంగానే ఈ పరిస్థితి నెలకొందన్నారు. మూడేళ్ల క్రితం ఎరువులు, విత్తనాలు ఉచితంగా ఇస్తానని ఇచ్చాడని ఆయన గుర్తు చేశారు. అడ్డగోలుగా అప్పులు తెచ్చిన కేసీఆర్ సర్కార్ రైతు రుణ మాఫీ చేయలేదన్నారు. కమీషన్ల కోసం కాంట్రాక్టులకు బిల్లులు చెల్లించారన్నారు. కానీ రైతుల రుణాలను మాత్రం మాఫీ చేయలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో పంట భీమా పథకం ఉండేదన్నారు. కానీ కేసీఆర్ సర్కార్ మాత్రం పంటల భీమా పథకం అమలు చేయ డం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు.రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తానని మోడీ హమీ ఇచ్చారన్నారు. కానీ ఒక్క పైసా ఆదాయం రైతులకు రెట్టింపు అయిందా అని ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రశ్నించారు.
అంతకుముందు భువనగిరి ఎంపీ komatireddy Venkat Reddy మాట్లాడారు. రాహుల్ గాంధీ సభ ను విజయవంతం చేసేందుకు నల్గొండ జిల్లా నుండి భారీ ఎత్తున జనాన్ని తరలిస్తామన్నారు. ఈ జిల్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి, తాను ఈ విషయాలను చూసుకొంటామన్నారు. పీకే విషయంలో తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయబోనని ఆయన ప్రకటించారు. పార్టీ అధిష్టానం నిర్ణయం ప్రకారంగా నడుచుకొంటామని ఆయన చెప్పారు.
